కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోవడానికి అంత టైం పడుతుందా ?
కరోనా వచ్చాక కొంత మందికి 10 రోజులకు.. మరి కొంత మందికి 20 రోజులకు తగ్గుతుంది. అయితే కొందరికి మూడు నెలల సమయం పడుతుంది. ఇక 10 - 15 రోజులకు కరోనా తగ్గినట్టు ఉన్నా కూడా వారు పూర్తిగా కోలుకునేందుకు మూడు నెలల టైం పడుతుందని చెపుతున్నారు. ఇక నాగేశ్వర్ రెడ్డి చెపుతోన్న దాని ప్రకారం కరోనా తగ్గాక కూడా దాని ప్రభావం మెదడు - ఊపిరితిత్తులు - జీర్ణకోశం - కాలేయం - కిడ్నీ - చెవి -ముక్కు - గొంతు - ఎముకలపై తీవ్రంగా చూపిస్తోందట. ఈ విషయంలో కరోనా నెగిటివ్ వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన చెపుతున్నారు.
కరోనా నుంచి కోలుకున్న వారిలో 41 శాతం మంది ఆ తర్వాత కూడా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సర్వేలో వెల్లడైందని ఆయన చెపుతున్నారు. ఇక కరోనా తగ్గిన వారిలో 30 ఏళ్ల వయసులోనే గుండెపోటు.. పక్షవాతం.. బ్లాక్ ఫంగస్ లాంటి ప్రమాదకర వ్యాధులు మానవ శరీరంపై దాడి చేస్తున్నాయి. కొందరికి కీళ్ల వాతం, మరి కొందరిలో షుగర్ లెవల్స్ కూడా పెరుగుతున్నాయట. ఈ విషయంలో ఎంత నిర్లక్ష్యం గా ఉన్నా ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉందని ఆయన చెపుతున్నారు. కరోనా తగ్గాక ఏ మాత్రం అనారోగ్యంగా ఉన్నా నిర్లక్ష్యం వహించ కూడదు.