షాకింగ్ : కోరిక తీర్చలేదని.. దేవుడికే శిక్ష వేశాడు?
అయితే ఇలా దేవుని కోరుకున్న వారికి తప్పనిసరిగా కోరికలు నెరవేరుతాయా అంటే ఆ గ్యారెంటీ కూడా లేదు. ఒకవేళ తాము కోరుకున్నది నెరవేరితే దేవుడి దయ అని మొక్కుకుంటారు. నెరవేరలేదు అంటే ఇక మనకు ఇంతే రాసిపెట్టి ఉందేమో అని అందరూ సర్దుకుపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన కోరిక తీర్చలేదు అన్న కారణంతో ఏకంగా దేవుడికే శిక్ష విధించాడు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. దేవుడిని కోరుకున్న తన కోరిక నెరవేరలేదు అని కోపంతో ఊగిపోయాడు ఒక వ్యక్తి. ఓ రోజూ మద్యం మత్తులో ఏకంగా దేవత విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
చిత్తూరు జిల్లా నాగలాపురం లో దారుణ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. మద్యం మత్తులో తాగుబోతు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించి మహిషాసురమర్ధిని విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. తనకు పిల్లలు పుట్టాలని ఎన్నో రోజుల క్రితం ఇక ఈ ఆలయంలో కోరుకున్నాడట సదరు వ్యక్తి అయితే రోజులు గడుస్తున్నాయి తప్ప పిల్లలు పుట్టడం లేదు అని ఆగ్రహంతో ఊగిపోయాడు. చేతిలేత్తి మొక్కినా దేవత మాత్రం కోరిక తీర్చలేదని ఏకంగా విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ క్రమంలోనే విగ్రహం తల భాగం మొత్తం విరిగిపడగా.. శులాన్ని కూడా విరిచేశాడు. విగ్రహాన్ని పీఠం మీద నుంచి పక్కకు నెట్టేశాడు. అయితే ఈ ఘటన హాట్ టాపిక్ గా మారగా.. నిందితుడుని అరెస్టు చేశారు పోలీసులు.