హుజురాబాద్‌కు కొత్త టెన్షన్‌...ఉప ఎన్నికకు బ్రేక్‌ ?

Veldandi Saikiran
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీకి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్ రాజీనామా టిఆర్ఎస్ పార్టీలో ముసలం రేపింది. టిఆర్ఎస్ పార్టీలో అసలు మనుగడ లేదంటూ బయటికి వచ్చిన ఈటల రాజేందర్... నేరుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక ఈటల రాజేందర్ రాజీనామాతో... హుజరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక అనివార్యమైంది. అంతేకాదు ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. హుజురాబాద్ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి.


 ఇప్పటికే బిజెపి అభ్యర్థి గా ఈటెల రాజేందర్ ను ప్రకటించగా.. టిఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ లు తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ హుజురాబాద్ ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్ పార్టీలోకి కౌశిక్ రెడ్డి వెళతారని... పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీల ప్రచారం ఇలా ఉండగా.... హుజూరాబాద్ నియోజకవర్గం లో మరో కొత్త టెన్షన్ మొదలైంది. అదేంటంటే.... కరోనా మహమ్మారి. అవును హుజూరాబాద్ నియోజకవర్గం లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లో జూలై మాసం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 1195 కరోనా కేసులు నమోదు అయ్యాయి.


అంటే గడిచిన 13 రోజుల్లో పాజిటివిటీ శాతం 2.01 శాతంగా నమోదైంది. జూన్‌ మాసం చివరి నుంచి పది రోజుల్లో ఇది 1.50 శాతం నుంచి 1.75 మధ్యలో ఉంటుంది. ప్రస్తుతం రికార్టు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 20 శాతం  కరీంగనర్‌ పట్టణంలో వస్తుండగా.... 30 శాతం నుంచి 34 శాతం కేసులు ఒక హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోనే నమోదు కావడం. ఆందోళన కర అంశం. అంతేకాదు.. హుజురాబాద్‌, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లోనే ఎక్కువగా నమోదు కావడం విశేషం. ఎందుకంటే... ఈ మండలాల్లోనే నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అసలు హుజురాబాద్‌ ఉప ఎన్నిక జరుగుతుందా? లేదా ? అనే ప్రశ్న మొదలైంది. కాగా... నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరగడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: