పశుసంవర్ధక, మత్స్య శాఖలపై సీఎం జగన్ సమీక్ష?
రైతులందరికీ కూడా ఎప్పుడూ మంచి ధరలు అందుబాటులో ఉండాలని సూచించారు. మత్స్య శాఖ ను మరింత ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇలా ఆక్వా హబ్ ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది అంటూ సీఎం జగన్ తెలిపారు. అయితే రవాణా నిలువ సహా తదితర అంశాల్లో కూడా అత్యుత్తమ ప్రమాణాలు పాటించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారించాలి అంటూ అధికారులకు సూచించారు సీఎం జగన్ ఇక ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆక్వా ల్యాబ్ లను వినియోగించుకోవడం పై ప్రచారం కూడా చేయాలని దీనిపై అటు రైతులందరికీ ఎంతగానో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అంటూ తెలిపారు.
ఆక్వా రంగం లోని రైతులందరికీ కూడా క్వాలిటీ చెకింగ్ ఎలా చేపట్టాలి అన్నదానిపై ఇక అధికారులు అందరూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి అంటూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సీడ్, ఫీడ్ ను ఉండాలి అంటూ తెలిపారు. ఆక్వా రంగంలో సీడ్, ఫీడ్ విషయంలో ఎలాంటి కల్తీలు జరిగిన ఉపేక్షించ వద్దు అంటూ తెలిపారు సీఎం జగన్. ముఖ్యంగా రాష్ట్రంలో ఏడు ఫిషింగ్ హార్బర్లు ఐదు ఫిష్ ల్యాండ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అధికారులు ఈ పనుల ప్రగతిపై దృష్టి సారించాలన్నారు. అయితే ఇప్పటికే ఐదు ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్లకు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి అంటూ అధికారులు సీఎం జగన్కు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్ ఫిష్ కల్చర్ మూడు చోట్ల మరి కల్చర్ లను మొదలుపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు కార్యక్రమం లో భాగంగా పశువుల ఆసుపత్రి లలో కూడా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ తెలిపారు.