భారత రత్న ఇవ్వాల్సిందే.. సీఎం డిమాండ్..!

NAGARJUNA NAKKA
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొస్తున్నారు. చిప్కో ఉద్యమం ద్వారా చెట్ల రక్షణకు ఎంతో కృషి చేసిన.. సుందర్ లాల్ బహుగుణకు అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఇవ్వాలన్నారు. ఆయనను చూసి దేశమే కాదు..మొత్తం ప్రపంచమే గర్వపడుతుందని కేజ్రీవాల్ అంటున్నారు.

సుందర్ లాల్ బహుగుణ వయసు 94సంవత్సరాలు. ఉత్తరాఖండ్ వాసి అయిన ఆయన 1927వ సంవత్సరం జనవరి 9న తెహ్రీలోని మరోడా గ్రామంలో పుట్టారు. 1980లలో తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సుందర్ లాల్ బహుగుణ పెద్ద ఉద్యమమే చేపట్టారు. దీంతో ఆయన ప్రపంచ దేశాలను ఆకర్షించారు. సుందర్‌లాల్ బహుగుణ ప్రకృతి ప్రేమికుడు. చెట్లంటే ప్రాణం. ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో అడువులను నరకడాన్ని ఈయన తీవ్రంగా వ్యతిరేకించారు.  పర్యావరణ ఆవశ్యకతను అందరికీ తెలియజేసేలా 1974లో చిప్కో ఉద్యమాన్ని చేపట్టారు. చిప్కో అంటే హత్తుకోవడం అని అర్థం.


1974వ సంవత్సరం జనవరిలో అలకానందకు సమీపంలో ఉన్న 2వేల 500 చెట్లను వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ సమయంలో చిప్కో ఉద్యమం పుట్టుకొచ్చింది. ఆయన ఉద్యమం శాంతియుతంగానే చేపట్టారు.  చెట్లను కౌగిలించుకుంటూ.. వాటి ఆవశ్యకతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. దీనికి స్పందించిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ.. చెట్లను నరకవద్దంటూ నిషేధం విధించింది. 15సంవత్సరాలు చెట్లను నరికివేతలు ఆగిపోయాయి. ఇదంతా సుందర్ లాల్ బహగుణ కృషి ఫలితమే. 
సుందర్ లాల్ బహుగణకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.  కరోనా బారిన పడిన ఆయన ఇటీవలే మే 8న కన్నుమూశారు. సుందర్ లాల్ బహుగుణ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆయనకు భారత రత్న ఇవ్వాలంటున్నారు. సుందర్ లాల్ బహుగుణ దేశానికి చేసిన సేవలు మరిచిపోలేనివి. నిజంగా ఆయనకు భారతరత్న ఇస్తే.. బాగుంటుందని పలువులు పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం.. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఏ విధంగా గౌరవిస్తుందో.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: