పగలు చర్చిలో పాస్టర్.. రాత్రి అయితే మాత్రం పది మందితో?
అతను ఒక చర్చిలో పాస్టర్ గా పని చేస్తున్నాడు... ఇక ఆ చర్చికి వచ్చిన భక్తులందరికీ కూడా ఎన్నో దైవ ప్రవచనాలు చెబుతూ ఉండేవాడు సదరు వ్యక్తి. ఇక ఈ క్రమంలోనే ఎంతో మంచి వ్యక్తి లాగానే ఉండేవాడు ఎవరితో ఎక్కడ చెడు ప్రవర్తన మాత్రం చేయకపోయేవాడు. అయితే ఇటీవలి కాలంలో పోలీసులు జరిపిన దాడుల్లో ఇక ఈ పాస్టర్ కు సంబంధించిన అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇక అతని అసలు రంగు తెలిసి అందరూ అవక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు మంచి వ్యక్తి అనే ముసుగులో అతను చేస్తున్న దారుణాలు తెలిసి అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏకంగా అతను ఒక వ్యభిచార గృహాన్ని నడుపుతున్నట్లు ఇటీవలే పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన తమిళనాడు కన్యాకుమారి జిల్లాలోని ఎస్టీ మంగడులో వెలుగులోకి వచ్చింది. ఎస్టి మంగడులో లాల్ షైన్ అనే 40 ఏళ్ల వ్యక్తి పాస్టర్ గా పని చేస్తున్నాడు. పగలు మొత్తం పాస్టర్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తి రాత్రి సమయంలో మాత్రం ఇక తనలోని అసలు రంగు బయట పెడుతున్నాడు ఏకంగా ఎంతో మంది మహిళలతో వ్యభిచారం నడుపుతున్నాడు సదరు పాస్టర్. పాస్టర్ పని ముగియగానే ఇక అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్టు ఇటీవలే పోలీసులు గుర్తించారు . కేరళతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మాయి లను తీసుకు వచ్చి ఇలా వ్యభిచార ముఠాని నడిపిస్తున్నాడని ఇటీవలే పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఒక్కసారిగా వ్యభిచార గృహంపై దాడి నిర్వహించి యువతులతో పాటు ఆ పాస్టర్ ని కూడా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.