బావిలో పడిన 40 మంది.. ఎలాగో తెలుసా?

praveen
మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తూ ఉంటాడు అని చెబుతూ ఉంటారు పెద్దలు.  కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇది నిజమే అని అనిపించక మానదు. కొన్నిసార్లు సహాయం చేయడానికి వెళ్లిన వ్యక్తులు ప్రమాదంలో పడిపోయి చివరికి ప్రాణాలు మీదికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఒక ప్రాణాన్ని కాపాడ పోయిన 40 మంది ఏకంగా వారి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు.  ఎనిమిదేళ్ల చిన్నారి బావిలో పడింది అని హుటాహుటిన బావి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆ చిన్నారిని కాపాడాలని అనుకున్నారు. కానీ అంతలోనే అక్కడికి చేరుకున్న 40 మంది కూడా ఆ బావిలో పడి పోవడం గమనార్హం. దీంతో చిన్నారి తో పాటు 40 మంది ప్రాణాలు కూడా ప్రమాదం లో పడిపోయాయ్. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.



 మధ్యప్రదేశ్లోని విధిషా లో బావిలో పడిన ఎనిమిదేళ్ల చిన్నారి కాపాడబోయి అక్కడికి వచ్చిన 40 మంది కూడా బావిలో పడిపోయారు. ఇక ఇలా బావిలో పడిపోయిన 40 మంది లో ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం తోపాటు ఇక ఒక ట్రాక్టర్ కూడా ఉండటం గమనార్హం. బావి దగ్గర ఉన్న గోడకూలి పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మృతి చెందగా 13 మంది గల్లంతైనట్లు తెలిపారు. ఇంకా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాయి. బావిలో ఎనిమిదేళ్ల బాలిక పడింది అని తెలియడంతో చుట్టూ జనం గుమిగూడారు.


 ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం ఇక బావిలో పడిన చిన్నారి ని తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఒత్తిడి పోవడంతో పెరిగిపోయింది. ఇక బావి చుట్టూ ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలోనే 40 మంది 40 అడుగుల లోతైన బావి లో ఒక్కసారిగా పడిపోయారు. ఇందులో రెస్క్యూ టీం సభ్యులు కూడా ఉండటం గమనార్హం. వెంటనే అప్రమత్తమైన మిగతా సిబ్బంది ఏకంగా 23 మందిని రక్షించారు ఇందులో 13 మందికి అత్యవసర చికిత్స అవసరం కావడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించినట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇంకా కుమ్మర సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: