డ్రోన్స్ వాడకంపై కొత్త రూల్స్ తీసుకువచ్చిన కేంద్రం?

praveen
ఇటీవలే భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన రెండు డ్రోన్లు అంతర్జాతీయ సరిహద్దుకి 14 కిలోమీటర్ల దూరంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్న భారత దేశం పై బాంబులతో దాడి చేయడం సంచలనంగా మారిపోయింది. అయితే ఈ డ్రోన్ దాడి అటు భారత రక్షణ వ్యవస్థ లోని లోటు పాట్లను తెలియజేసింది అని అప్పట్లో విశ్లేషకులు కూడా అన్నారు  అయితే ఈ ఘటనపై అటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించి కీలక చర్చలు జరిపారు. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో డ్రోన్ ల వాడకం నియంత్రణ అనుమతులకు సంబంధించి నూతన నిబంధనలను రూపొందించినట్లు తెలుస్తోంది

 ఈ మేరకు ఇటీవలే 2021 డ్రోన్ రూల్స్ పేరిట ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది కేంద్ర పౌర విమానయాన శాఖ. ఈ ఏడాది మార్చిలో అమలులోకి వచ్చిన మానవ రహిత ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థ నిబంధనల స్థానంలో కొత్త రూల్స్ ని తీసుకు వచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ డ్రోన్ లకు సంబంధించిన నిబంధనలను డీజీసీఏ రూపొందించినట్టు తెలుస్తోంది. ఇక దీని ప్రకారం ఇకనుంచి గాల్లో ఎగిరే ప్రతీ డ్రోన్ కి కూడా యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉండాలని ఒక ప్రత్యేకమైన నెంబర్ కేటాయించాలని నిబంధనలో పేర్కొన్నారు. అంతేకాదు డ్రోన్ల తయారీ బరువు కు సంబంధించి కూడా ఎన్నో నియమ నిబంధనలను రూపొందించినట్లు తెలుస్తోంది

 ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త ముసాయిదా నిబంధనలపై ప్రజలు ఆగస్టు 5వ తేదీ వరకు తమ అభిప్రాయాలను తెలపాలి అంటూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పటికే మానవరహిత ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ తీసుకువచ్చేందుకు అటు ప్రధాని మోదీ మంత్రులతో కీలక సమావేశం జరిపిన విషయం కూడా తెలిసిందే  జమ్ము ఎయిర్ బేస్ పై దాడి తర్వాత ఈ సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. సమావేశం జరిగిన కేవలం రోజుల వ్యవధిలోనే కొత్త డ్రోన్ పాలసీని తీసుకొచ్చింది కేంద్రం  ఇక ఈ కొత్త రూల్స్ ప్రకారం సింగిల్ విండో విధానంలో డ్రోన్ లకు అనుమతులు జారీ చేస్తారు  ఇక ఎలాంటి మానవ ప్రమేయం దీనికి సంబంధించిన అనుమతుల జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త నిబంధన ప్రకారం ఇక డ్రోన్ వినియోగానికి 5 అప్లికేషన్లని నింపితే సరిపోతుంది. అంతేకాకుండా ఫీజు సైతం కేంద్ర సవరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంత జరిమానా లక్ష వరకు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో రిజిస్టర్ అయిన విదేశీ డ్రోన్లు తిరగటానికి కూడా ఎలాంటి ఆంక్షలు ఉండవు అంటూ కొత్త పాలసీలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: