కరోనా థర్డ్ వేవ్ పై కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. కీలక అంశాలను సూచించింది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో కరోనా అంశంపై మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా థర్డ్‌వేవ్ మొదలయ్యే సమయం ప్రారంభంకాబోతోందని ప్రపంచ దేశాలను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న 100 రోజులు మానవాళికి అత్యంత కీలకమని, గడ్డు కాలమని కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత, బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా థర్డ్ వేవ్ కారణంగా పరిస్థితులు చేయి దాటి పోతున్నాయని, ప్రపంచ దేశాలు కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతున్న సమయంలో భారతీయులు తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వహించి కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తే ముప్పు తప్పినట్లే నని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ సూచనలు జారీ చేసింది.
‘ఇప్పటికే చాలా దేశాలు కరోనా థర్డ్ వేవ్ తో అల్లాడి పోతున్నాయి. దక్షిణ, ఉత్తర అమెరికాలు తప్ప దాదాపుగా మిగిలిన అన్ని ప్రదేశాల్లోనూ కరోనా విజృంభిస్తూ పెను ప్రమాదంగా మారుతోందని తెలిపింది. కావున దీన్ని హెచ్చరికగా భావించి ఇకపై అత్యంత జాగ్రత్త వహించాలని, కరోనా మూడవ దశను మొదట్లోనే అరికట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆరోగ్య సంస్థ ఆదేశించారు. ఈ విషయంపై స్పందించిన నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ థర్డ్ వేవ్ ను అడ్డుకోవడం అసాధ్యమైన విషయం ఏమీ కాదు. మన చేతిలో ఉన్నదే. మూడవ దశ ఆరంభంలోనే ప్రజలు అప్రమత్తమైతే థర్డ్ వేవ్ ను కట్టడి చేయడం సాధ్యమేనన్నారు. నెదర్లాండ్, స్పెయిన్ , బంగ్లాదేశ్, ఆఫ్రికా మయన్మార్, మలేసియా, ఇండోనేసియా వంటి దేశాల్లో ఇప్పటికే కరోనా మూడో దశ తన పంజా విసురుతూ ఉదృతి పెంచిందని వీకే పాల్ పేర్కొన్నారు. ఇక మన దేశం విషయానికి వస్తే కరోనా నీలి చాయలు దేశాన్ని ఇంకా వీడలేదు. వైరస్ ని తట్టుకోగల హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా మనలో పెంపొందలేదు. కనీసం 50 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ అందడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించే అవకాశం ఉంది.
కాబట్టి అప్పటివరకు ఓవైపు ప్రభుత్వాలు తమవంతు బాధ్యతలు నిర్వహిస్తూ చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు, ప్రజలు కూడా అందుకు సహకరిస్తూ తమని తమ కుటుంబాలను సంరక్షించుకునేందుకు రానున్న 100 రోజుల్లో అత్యంత బాధ్యతగా వ్యవహరించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వి కె పాల్. ఇక్కడ ప్రభుత్వాలు వైద్యులు చేసేదేమీ ఉండదు. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని మీ ప్రాణాలను కాపాడుకోండి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి రాబోయే 100 రోజులు అవసరమైతే తప్పించి ఇంటిని నుండి బయటకు రాకపోవడమే అముఞ్చిదని కరోనా వైద్య నిపుణులు మరియు ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి.