వాళ్లదే కాదు.. మనది కూడా పొడవే..!

NAGARJUNA NAKKA
చైనా.. ది గ్రేట్ వాల్.. ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఇది ఒకటి. దీన్ని చైనాకు తొలి రాజు అయిన క్విన్ షి హుయాంగ్ నిర్మించారు. ఆయన క్విన్ వంశానికి చెందిన వారు. కొండ ప్రాంతాలను చదును చేసి మరీ నిర్మాణాన్ని చేపట్టారు.
ఈ గోడ కొండలపై వంపులు.. వంపులుగా.. అచ్చం పాము కొండెక్కినట్టే కనిపిస్తుంది. ఈ గోడను ఆ దేశ పూర్వికులు రక్షణ కోసమే నిర్మించుకున్నారు. ముఖ్యంగా ఉత్తర చైనాలో ఉండే మాంగోలియన్ల దాడుల నుండి తప్పించుకునేందుకు చైనీయులకు ఈ గోడ అవసరమైంది. ఆశ్చర్యం ఏంటంటే ఈ గోడ పొడవు 21వేల 196కిలోమీటర్లు.. వెడల్పు 30అడుగులతో ఆకట్టుకుంటోంది. ఇక ఎత్తు విషయానికొస్తే 25అడుగుల వరకు ఉంటుంది. ఘన చరిత్ర కలిగిన ఈ నిర్మాణాన్ని యునెస్కో గుర్తించింది. 1927వ సంవత్సరంలో ప్రపంచ వారసత్వంగా గుర్తించింది. అంతేకాదు ప్రపంచాల్లోని అద్భుత కట్టడాల్లో ఏడోస్థానం ఈ గోడ దక్కించుకుంది. ఈ నిర్మాణాన్ని చూసేందుకు ఏటా కోటిమందికిపై సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.


ప్రపంచంలోనే అతి పొడవైన గోడ.. చైనాలో ఉంటే.. రెండో పొడవైన గోడ మన దేశంలోనే ఉంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ నుంచి 75కిలోమీటర్ల దూరంలోని కుంభల్ గఢ్ లో పొడవైన గోడ ఉంది. ఈ గోడ పటిష్టంగానే కాదు.. విశాలంగానూ ఉంటూ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. సముద్ర మట్టానికి 3వేల 600కిలోమీటర్ల ఎత్తులో ఈ కట్టడాన్ని కట్టారు. మొఘల్స్ దండయాత్ర నుంచి రక్షించుకునేందుకు మేవాడ్ రాజైన మహారాణా కుంభ దీన్ని నిర్మించారు. దీన్ని కట్టేందుకు ఏకంగా 15సంవత్సరాల సమయం పట్టింది. 1443 నుండి 1458సంవత్సరాల మధ్య కాలంలో ఈ వాల్ ను నిర్మించారు. ఈ గోడ పొడవు 36కిలోమీటర్లు ఉండగా.. వెడల్పు పదిహేను అడుగులు ఉంటుంది. ఏడు గేట్లు ఉంటాయి. మొఘల్ చక్రవర్తులను ధీటుగా ఎదుర్కొన్న మహా రాణా ప్రతాప్ ఇక్కడే జన్మించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: