సొంత పార్టీ వాళ్ల‌నే మోసం చేసిన చంద్రబాబు... ?

VUYYURU SUBHASH
చంద్రబాబు అంటేనే రాజకీయ చాణక్యుడు అని చెబుతారు. ఆయన తన సొంత మామ ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాగేసుకున్నారని కూడా అంటారు. అయితే చంద్రబాబు విషయంలో ఒకటి ఉంది. తాను ఉన్నతమైన పదవులు అనుభవిస్తున్నా పార్టీకి ఆరుగాలం పనిచేసే క్యాడర్ కి మాత్రం తగిన న్యాయం ఎపుడూ చేయరని అంటారు. పదవులు ఇవ్వడానికి బాబు మనసే కాదు చేతులు కూడా ముందుకు రావు అని కూడా సొంత పాటీలోనే ఎపుడూ చర్చగా ఉంటుంది. ఒక పదవిని ఇవ్వాలీ అంటే దాని మీద చంద్రబాబు జరిపే చర్చలు చేసే కసరత్తులూ  ఇన్నీ అన్నీ కావు. అలా కసరత్తు చేసి చేసి ఒకరో ఇద్దరికో పదవులు ఇచ్చేసరికి బాబు అధికార పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది.

చంద్రబాబు ఉమ్మడి ఏపీ, విభజన ఆంధ్రా కలుపుకుని ఏకంగా పద్నాలుగేళ్ళ పాటు సీఎం గా పనిచేశారు. అయితే ఏం లాభం తమ్ముళ్లకు, పార్టీ జెండా మోసిన సిసలైన కార్యకర్తలకు ఎన్ని పదవులు ఇచ్చారు అన్న లెక్క తీస్తే మాత్రం దారుణంగా ఉంటుంది. చంద్రబాబు హయాంలో ఎపుడూ పదవులు అందుకున్న కార్యకర్తలు పెద్దగా కనిపించరు. అంతవరకూ ఎందుకు నామినేటెడ్ పదవులు బోలెడు  ఆనాడూ ఈనాడూ కూడా ఉన్నా కూడా వాటిని అలా మురగబెట్టి మూలన ఉంచారు తప్ప కార్యకర్తలకు ఇవ్వాలను బాబు ఎపుడూ అనుకోలేదు అన్నది తమ్ముళ్ల ప్రధాన అభియోగం.

ఇక గత అయిదేళ్ళూ చంద్రబాబు పాలన సాగింది. ఆ టైమ్ లో కూడా ఆయన నామినేటెడ్ పదవులు పంపిణీ అంటూ కాలం గడిపేశారు తప్ప ఇచ్చింది లేదు. ఇపుడు చూస్తే జగన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలోనే  వేలాది పదవులు భర్తీ చేశారు. అది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు యాభై శాతానికి పైగా మహిళలకు ఆ పదవులను ఇచ్చి వారి ఆదరణ చూరగొన్నారు.

మరి ఇదే బాబుకీ జగన్ కి తేడా అని తెలుగుదేశంలోనే వినిపిస్తోంది అంటే బాబోరు తన తప్పులు ఎప్పటికీ ఎరుగరు అన్నదే నిజమనుకోవాలిగా. ఈ రకంగా బాబు క్యాడర్ కి అన్యాయం చేయడం వల్లనే 2019 ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వచ్చాయని కూడా టీడీపీలో చెప్పుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: