షాకింగ్ : నేలకేసి కొట్టినా పగలని కోడిగుడ్లు?
ఇటీవలే నేటి సమాజంలో కల్తీ ఏ రేంజ్ లో ఉన్నది అన్న విషయాన్ని తెలిపేందుకు ఒక ఘటన నిదర్శనం గా మారిపోయింది సాధారణంగా కోడిగుడ్ల గురించి అందరికీ తెలిసిందే. అయితే కోడిగుడ్లను ఎంతో జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏమాత్రం చేజారిపోయిన కింద పడిపోయాయి అంటే పగిలి పోతూ ఉంటాయి కోడిగుడ్లు. ఇక కోడి గుడ్లు చేతిలో ఉన్నాయి అంటే చాలు అందరూ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కోడిగుడ్లు పొరపాటున చేజారకుండా చూసుకుంటారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి పొరపాటున కోడిగుడ్లను చేజార్చడం కాదు ఏకంగా నేలకేసి కొట్టాడు.
అయితే అలా నేలకేసి కొట్టి నప్పుడు ఏం జరిగి ఉంటుంది అంటే ఇంకేం జరుగుతుంది గుడ్డు పగిలిపోయి ఉంటుంది అని అంటారు ఎవరైనా.. కానీ అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే అతను నేలకేసి కొట్టినప్పటికీ ఆ కోడిగుడ్డు మాత్రం పగల్లేదు ఎందుకు అంటారా ఎందుకంటే అది నకిలీ కోడిగుడ్డు. ఇటీవలే నెల్లూరు జిల్లా ఆండ్ర వారి పల్లి లో ప్లాస్టిక్ కోడి గుడ్డు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి కోడిగుడ్లు తక్కువ ధరకు అమ్మారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి కొనుగోలు చేసిన కోడిగుడ్లను ఉడికించాడూ. అయితే వెంటనే కోడిగుడ్లు నల్లగా మారిపోయాయ్. దీంతో ఏంటా అని ఆ కోడి గుడ్డు నేలకేసి కొట్టిన అవి పగలలేదు దీంతో అవి నకిలీ కోడిగుడ్లు భావించి షాకయ్యాడు సదరు వ్యక్తి.