కేటీఆర్ భార్య అకౌంట్ లోకి డబ్బులు.. రేవంత్ షాకింగ్ కామెంట్స్?
ఈ విషయంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలో కేటీఆర్ భార్య శైలిమ, సీమ, సుష్మ శ్రీలకు అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేశారు అంటూ సంచలన విమర్శలు చేశారు తేలు కుంట్ల శ్రీధర్ ఈ వ్యవహారాలను చక్క పెట్టారు అంటూ ఆరోపించారు రేవంత్ రెడ్డి ఇటీవలే ఏకంగా తేలు కుంట్ల శ్రీధర్ దగ్గరనుంచి కేటీఆర్ భార్య అకౌంట్లోకి ఏడు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక ప్రభుత్వ భూములు కొన్న వర్సిటీలు కంపెనీలలో సీమ, సుష్మ ప్రస్తుతం డైరెక్టర్ లుగా కొనసాగుతున్నారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వ భూముల వేలంలో పాల్గొని ఎన్నో భూములను సొంతం చేసుకున్న ప్రెస్టేజ్ కంపెనీ తో కూడా కెటిఆర్ కు లావాదేవీలు ఉన్నాయి అంటూ విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.
ఇటీవలే తెరాస ప్రభుత్వం దోపిడీకి కొత్త తరహా విధానం కనుగొంది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు తక్కువ ధరకే ప్రభుత్వ భూములను అమ్మేసి ఇక డెవలప్ మెంట్ ను తమ బంధువులకు అప్పగించారు అంటూ విమర్శలు చేశారు. ఇక డెవలప్మెంట్ అంటూ చెబుతూ కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఒక ల్యాండ్ మాఫియా లీడర్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రొక్యూర్ మెంట్ విధానంలో కాకుండా మరో విధానంలో ఎందుకు భూములు అమ్మారు అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ప్రభుత్వ భూముల వేలం లో పాల్గొని భూములు కొన్న కంపెనీలతో పాటు పోటీ పడ్డ కంపెనీల పేర్లను కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో ఖాకీల కాళ్ళ కింద ప్రజల ఆత్మగౌరవం నలుగుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. మరో 18 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.