పెరూ నూతన అధ్యక్షుడిగా పెరూ లిబర్టీ
పార్టీ నేత పెడ్రో కాస్టిలో ఎన్నికయ్యారు. నెల రోజుల పాటు సాగిన కౌంటింగ్ లో సమీప ప్రత్యర్థి కెయికో ఫుజి మోరిపై 44వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన కాస్టీలో.. టీచర్ గా పనిచేశారు. ధనిక దేశంలో పేద దేశం ఉండకూడదు అనే నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేశారు. మైనింగ్ రంగంపై పన్ను రేట్లను పెంచి.. వచ్చిన ఆదాయాన్ని ప్రజా అవసరాలపై ఖర్చు చేస్తానని తెలిపారు.
పెరూలో నువ్వానేనా అన్నట్టు అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వామపక్ష పార్టీకి చెందిన పెడ్రో కాస్టిల్లో ఊహించని విజయం సాధించారు. ఇంకేముందీ ఆయనకు స్వదేశం నుంచే కాదు విదేశాల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కీకో ఫఉజిమోరి.. పెడ్రో కాస్టిల్లో ల మధ్య పోరు ఒక రేంజ్ లో జరిగింది. ఇద్దరూ బద్ద శత్రువుల్లాగే ప్రవర్తిస్తారు. ఎన్నికల ప్రచారంలో మాటల దాడికి పదును పెట్టారు. ఎట్టకేలకు ప్రజల నుంచి విశేష ఆధరణ సంపాదించుకున్నారు పెడ్రో కాస్టిల్లో. కీకో ఫుజిమోరి అయితే ప్రైవేటీకరణ విధానాలను ప్రధానాంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈమె ఎవరో కాదు అవినీతి ఆరోపణలతో జైల్లో ఊచలు లెక్కించిన పెరూ మాజీ అధ్యక్షుడు ఆల్బర్టో ఫుజిమోరి ముద్దుల కూతురు.
తండ్రి ద్వారా రాజకీయ వారసత్వాన్ని సంపాదించుకుంది. ఫుజిమోరికి కూడా అవినీతి మరకలు అంటి.. జైలు జీవితం గడిపింది.
ఇక పెడ్రో కాస్టిల్లో విషయానికొస్తే ఇతను సాధారణ ప్రైమరీ
స్కూల్ టీచర్. దీంతో ఆయనకు గ్రామీణ ప్రజలతో అవినాభావ సంబంధం ఉంది. పేద వర్గాల మద్దతు అధికంగా ఉంది. అంతేకాదు అత్యంత దీన స్థితిలో ఉన్నవారి స్థితిగతులను దగ్గరుండి చూసిన పెడ్రో కాస్టిల్లో.. సామాన్యుల అభ్యున్నతికి కృషి చేస్తానని ప్రకటించారు. ఆర్థిక విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుడతానని ప్రకటించారు. పేరూ దేశంలో పేదరికాన్ని లేకుండా తుడిచి వేద్దామని చెప్పారు. అంతేకాదు మైనింగ్ రంగంలో ట్యాక్స్ లు పెంచి దారిద్ర్యాన్ని తరిమికొడతాననే ప్రకటన ప్రజలను వివరీతంగా ఆకట్టుకుంది. అందుకే ఆయన్ను అధ్యక్ష పీఠంలో కూర్చునేలా చేసింది.