మహా మునిగా ఎమ్మెల్యే.. ఎందుకంటే..?
తాజాగా ఆయన ఓ సినిమాలో నటిస్తున్నారు. అందుకోసం ఇలా మునివేషం వేసారని తెలిసి ఆయన అభిమానులు ఇదా విషయం అని అనుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ధర్మశ్రీకి చచ్చేంత అభిమానం. తనకు పక్కాగా మంత్రి పదవి వస్తుందనకునగా ఎందుకో కాని ఆయనకు మంత్రి పదవి రాలేదు. దీంతో ఆయన నిరుత్సాహ పడకుండా ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. ఇలాంటి రాజకీయంగా సేవ చేసి ప్రజలకు దగ్గరైన కరణం ధర్మశ్రీ ప్రస్తుతం నటనతో చేరువ కావాలని చూస్తున్నారు.
ఆయన గిరిజనుల దైవం మోదకొండమ్మ తల్లి సినిమాలో మునిగా చేస్తున్నారు. జై. మోదకొండమ్మ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేశారు. కాగా ఇందులో నటిస్తున్న ఎమ్మెల్యే పై తీసిన కొన్ని షాట్లకు చెందినవే ఈ ఫొటోలు. మరో విషయం ఏంటంటే ఎమ్మెల్యే ధర్మశ్రీ ఇంటి వద్దే ఈ షూటింగ్ జరిగింది. ఇందుకు సంబందించిన వీడియోను ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ధర్మశ్రీకి నటన అంటే చాలా ఇష్టమట. ఇప్పటికే ఎమ్మెల్యే సొంత ఊరిలో చాలా రోజుల పాటు చాలా నాటకాల్లో నటించాడని స్థానికులు పేర్కొంటున్నారు. కానీ అనుకోకుండా ఆయన 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.