తెలంగాణలో అక్క‌డ మళ్లీ లాక్ డౌన్..! ఎందుకంటే..?

Paloji Vinay
దేశంలో ఇప్పుడుప్పిడే క‌రోనా రెండ‌వ ద‌శ త‌గ్గుముఖం ప‌డుతోంది. తెలంగాణ‌లో కూడా క‌రోనా సెకండ్ వేవ్ త‌గ్గ‌న‌ట్టే క‌న‌బ‌డుతోంది. ఇదే క్ర‌మంలో మూడో వేవ్ రూపంలో క‌రోనా మ‌ళ్లీ మొదల‌యిన‌ట్టే క‌నిపిస్తోంది. కరోనా కేసులు తగ్గాయన్న కారణంతో వ్యాపారాలు , కూలీలు , ఉద్యోగస్తులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. అంతే కాకుండ షాపింగ్ కాప్లెక్స్ లు కూడా తెరుచుకున్నాయి. కొద్ది రోజుల్లో , సినిమా థియేట‌ర్లు కూడా ప్రారంభం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.
  అలాగే త్వ‌ర‌లో పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌ను తెరిచేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌న్నాహాలు కూడా చేస్తోంది. ఇదే క్ర‌మంలో మళ్లీ థర్డ్ వేవ్ వ్యాపిస్తోందన్న వార్తలతో మరోసారి రాష్ట్రంలో లాక్‌ డౌన్లు మొదలయ్యాయి.
  తాజాగా జగిత్యాల జిల్లాలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. వెల్గటూర్ మండలం ఎండపల్లిలో గత రెండు రోజుల క్రితం కరోనాతో ఒకరు మృతి చెందడంతో పాటు .. కరోనా కేసుల సంఖ్య 12 కు పెరిగింది. అలాగే ప్రతీ రోజు అక్కడ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. దీంతో ఆ గ్రామంలో జూలై 19 వ తేదీ నుంచి ఆగస్ట్ 1 వరకు పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ గ్రామపంచాయతీ పాల‌క వ‌ర్గం తీర్మాణం చేసింది.
 ఉదయం ఏడు గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని .. ఆ తర్వాత మూసేయాలంటూ తీర్మానంలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణ యజమానులకు 5 వేల రూపాయల జరిమాన విధిస్తామని హెచ్చ‌రించారు.

  అయితే క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తుంద‌న్న వార్త‌ల‌తో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ థ‌ర్డ్ వేవ్‌లో పిల్ల‌ల‌కు ఎక్కువ‌గా ప్ర‌మాదం పొంచి ఉంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నానే విష‌యం తెలిసిందే. క‌రోనా వేరియంట్‌లుగా రూపాంత‌రం చెందుతూ ప్ర‌జ‌ల పాలిట మ‌హ‌మ్మారిగా మారింది. ఎక్క‌డో చైనాలో పుట్టిన ఈ వైర‌స్ ప్ర‌పంచాన్ని అత‌లాకుతలం చేస్తోంది. మొద‌టి వేవ్‌లో ల‌క్ష‌ల మందికి పైగా కోల్పోయారు. ఆ త‌రువాత కొంచెం కొంచెం ప్ర‌పంచం కోలుకుంటున్న నేప‌థ్యంలో సెంకండ్ వేవ్ పిడుగు ప‌డింది. దీంతో
దేశంలోని ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ ను ప్ర‌క‌టించాయి.

  ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ ఎత్తి వేసి, ఆంక్ష‌లు స‌డ‌లిస్తున్న క్ర‌మంలో మ‌ళ్లీ క‌రోనా మూడో వేవ్‌గా రూపాంతం చెంద‌నుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలా జ‌రిగితే సామాన్య‌లు భారీగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది. క‌రోనా వ్యాక్సినేష‌న్‌ను పూర్తిగా ప్ర‌జ‌ల‌కు అందించే వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, స్వీయ ర‌క్ష‌ణ చ‌ర్య‌లు పాటించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: