మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఆయన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే. అయితే ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. అటు ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు టిఆర్ఎస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ మంత్రులు అక్కడ ప్రచారం సాగిస్తుండగా... దళిత బంధు అనే పేరుతో మరో స్కీమ్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి కెసిఆర్. ఈ దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం లోనే ప్రారంభించాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ దళిత బందు స్కీమ్ పై నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పథకం అమలు చేయడంపై దిశానిర్దేశం చేశారు.
దళిత బంధు అమలు కోసం ఈనెల 26వ తేదీన తొలి అవగాహన సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఈ తొలి సదస్సును హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రారంభం చేయనున్నారు. ఈ సదస్సు వివరాల్లోకి వస్తే... 26వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో దళిత బంధువు పథకానికి సంబంధించిన తొలి సదస్సు హుజురాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గం లోని గ్రామానికి నలుగురు చొప్పున మరియు ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున మొత్తం 412 మంది దళిత పురుషులు మరియు మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ నాలుగు వందల పన్నెండు మంది తో సహా 15 మంది రిసోర్స్ వ్యక్తులు కూడా పాల్గొన్నారు. దీంతో మొత్తం 427 మంది ఈ నియోజకవర్గానికి చెందిన దళితులే ఉండనున్నారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గులాబీ కంకణం కట్టుకున్నారు.ఈ పైలెట్ ప్రాజెక్టు ను హుజూరాబాద్ నియోజకవర్గం లో చేపట్టిన నేపథ్యంలో.... ఆ ప్రాంత దళితులు లీనమై పని చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈ పథకం ద్వారా దళితులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో జీవించగలుగుతారని... అందుకే ఈ పథకాలను తీసుకొస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్తారు. ఈ పథకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి ఏకంగా పది లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.