వీర్యం తీసిన కాసేపటికే.. భర్త ప్రాణం పోయింది?

praveen
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది   సంతోషంగా సాగిపోతున్న జీవితంలో అల్లకల్లోలం సృష్టించింది కరోనా వైరస్. ఈ క్రమంలోనే ఎంతోమంది  వైరస్ కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయి చివరికి రోడ్డున పడే పరిస్థితులు కూడా వెలుగులోకి వచ్చాయి. రోజు రోజుకి ఇలాంటి తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పటికి కూడా కరోనా వైరస్ ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూనే ఉంది.



 అయితే సాధారణంగా  ప్రియమైన వారు  వైరస్ బారిన పడి చివరికి తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే ఎవరైనా వెంటనే కోలుకోవాలని ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక భార్య మాత్రం ఏకంగా తన భర్త వీర్యాని తనకు ఇప్పించాలంటూ కోర్టుకు ఎక్కడం సంచలన గా మారిపోయింది. ఇటీవలికాలంలో దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అనే విషయం తెలిసిందే.  ఓవైపు కట్టుకున్న భర్త ఇక మరికొన్ని రోజుల్లో ప్రాణాలు వదులుతాడు అన్న బాధ.. అదే సమయంలో పిల్లలు లేని తనకు తన భర్త వీర్యం ద్వారా అయిన ఇక అతని ప్రతి రూపాన్ని ఎప్పుడూ చూసుకోవచ్చు అని ఒక్క ఆశ.



 చివరికి ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది  చావుబతుకుల మధ్య ఉన్న తన భర్త వీర్యాన్ని తనకు ఇప్పించాలంటూ కోరింది.  అయితే ఇక ఆ మహిళ బాధను అర్థం చేసుకున్న కోర్టు ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ఒక వీర్యాన్ని ఆ మహిళకు అందించాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది   అయితే ఇటీవలే బాధితుడి నుంచి అటు వైద్యులు వీర్యాన్ని సేకరించారు  కానీ అంతలోనే విషాదం జరిగిపోయింది. వీర్యాన్ని సేకరించిన కొంత సమయంలోనే బాధితుడు ప్రాణాలు వదిలాడు. దీంతో ఇక ఆ మహిళ కన్నీరు మున్నీరుగా విలపించింది. గుజరాత్ లో జరిగింది  ఈ ఘటన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: