`ద‌ళిత బంధు` ధ‌ర‌ఖాస్తుకు ప్ర‌త్యేక యాప్‌.. వివ‌రాలివే..!

Paloji Vinay
దేశంలో ఎక్క‌డా లేని సంక్షేమ ప‌థ‌కాల‌ను తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్నామ‌ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వ‌స్తోంది. అదే క్ర‌మంలో ఇటీవ‌ల మ‌రో ప‌థ‌కానికి తెలంగాణ సీఎం శ్రీ‌కారం చుట్టారు. అదే ద‌ళిత బంధు.. ద‌ళితుల‌కు మేలు చేయాల‌నే ఉద్ధేశంతో ఈ ప‌థ‌కాన్ని ప్రవేశ‌ప‌ట్టిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. దీని ద్వారా ప్రతీ నియోజకవర్గంలో 100 మంది దళితులను ఎంపిక చేసి వారికి రూ. 10 లక్షలను అందించాలని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇదే క్ర‌మంలో ఆ ప‌థ‌కం అములు కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఓ ప్ర‌త్యేక యాప్‌ను కూడా రూపొందిస్తోంది.
     ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం సన్నాహాలు చేస్తోంది. నియోజవర్గంలో రూ. 2 వేల కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయాలని స‌ర్కార్ నిర్ణయించింది. ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళిత బంధు అవగాహన కార్యక్రమం నిర్వహించ‌నున్న‌ట్టు తెలిసిందే. ఈ సమావేశంలో పథకం అమలుకు మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉంది.
    ఈ ప‌థ‌కంలో ఇత‌ర ప్ర‌యోజ‌నాలు పొంద‌ని కుటుంబాల‌ను మాత్ర‌మే లెక్క‌లోకి తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది.  ఈ పథాకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజవర్గంలో అమ‌లు చేసిన తర్వాత దీన్ని రాష్ట్రమంతటా అమలు చేయనున్నట్లు ప్ర‌భుత్వం వివ‌రించింది. ఈ పథ‌కం కోసం రూ.1200 కోట్లను కేటాయించినట్లు ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. మొద‌టి విడుత‌లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున‌, రాష్ట్ర‌వ్యాప్తంగా 11,900 కుటుంబాల‌కు ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ది చేకూర్చేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు తెలిసింది. రైతుబంధు ప‌థ‌కం లాగానే నేరుగా ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను ప్ర‌భుత్వం జమ చేయనుంది.

హుజూరాబాద్ ఎన్కిక‌ల వేళ ప్ర‌వేశపెట్ట‌నున్న ఈ ప‌థ‌కాన్ని అత్యంత పార‌ద‌ర్శంగా అమలు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ మేర‌కు ప‌థ‌కం ద‌ర‌ఖాస్తు కోసం ప్ర‌త్యేక యాప్‌ను రూపొందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించింది. అప్లికేష‌న్ రూపొందించ‌డానికి  ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(CGG) కి అప్ప‌జెప్పింది. యాప్ తో పాటు, వెబ్ పోర్టల్ ను ఈ నెల చివరిలోగా రూపొందించి అందుబాటులోకి తీసుకురావాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: