శభాష్ శాంతి.. ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా?

praveen
కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రకాల పర్యాటక ప్రాంతాలలో కూడా పర్యాటకులను అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్నటివరకు కరోనా వైరస్ కారణంగా ఇక భయంతో ఇంటి పట్టునే ఉండి పోయిన ఎంతో మంది జనాలు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే..  కొన్ని కొన్ని సార్లు పర్యాటకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. అక్కడ ప్రమాదకరం అని ఒక బోర్డు ఉన్నప్పటికీ కూడా అవి పట్టించుకోకుండా ప్రమాదం పొంచివున్న ప్రాంతాలకు వెళుతూ ఉంటారు.

 ఇక చివరికి పర్యాటక ప్రాంతానికి వెళ్లి ఎంతో ఆనందంగా గడపాల్సింది పోయి ప్రమాదపు అంచుల్లో కి వెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు  కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇలా ప్రమాదకర పర్యాటక ప్రాంతాల్లో అప్పుడప్పుడు పోలీసులు గస్తీ ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు అటు పర్యాటకులను గమనిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు పోలీసులు ఇక ప్రమాద ప్రాంతాలలో కాకుండా తమ పని తాము చేసుకుంటూ నిమగ్నమవుతారు  కాని ఇక్కడ ఒక మహిళా పోలీసు అధికారి మాత్రం ఎంతో సాహసోపేతంగా విధులు నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.

 విశాఖ ఆర్కే బీచ్ అంటే ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం. ఇక ఇటీవల  ఆదివారం రోజున అయితే ఆ రద్దీ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే కొంత మంది పర్యాటకులు అత్యుత్సాహం వల్ల అనుకోకుండా ప్రమాదాలు జరిగి పోతుంటాయి. అయితే ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు కానిస్టేబుల్ శాంతి ప్రమాదానికి గురయ్యే ప్రాంతంలోనే నిలబడి ఏకంగా అక్కడికి వచ్చే పర్యాటకులు అందరికీ కూడా అవగాహన కల్పించింది. ఇక కానిస్టేబుల్ శాంతి ఇక విధులు నిర్వహించిన ఫోటోనీ విశాఖ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమె ధైర్యసాహసాల పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇది చూసిన నెటిజన్లు కూడా శభాష్ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: