"మిస్సైల్ మ్యాన్" కు సలాం..!

NAGARJUNA NAKKA
ఆవుల్ ఫకీర్ జైనలుద్దీన్ అబ్దుల్ కలాం. అందరూ గౌరవంగా ఏపీజే అబ్దుల్ కలాం అని పిలుచుకుంటారు. సైంటిస్టుగా.. ప్రెసిడెంట్ గా.. విద్యార్థులకు మార్గదర్శకుడిగా.. ఒక రైటర్ గా ఎన్నో ప్రతిభాపాటవాలు చూపిన ఏకైక మహోన్నత వ్యక్తి. అంతేకాదు మిస్సైల్ మ్యాన్ గా భారతదేశ సాంకేతిక వెలుగులను ప్రపంచానికి చాటిన గొప్ప శక్తి అబ్దుల్ కలాం. భరత మాత ముద్దుబిడ్డగా ఆయన దేశానికి చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. రామేశ్వరంలో ఒక సాధారణ కుటుంబంలో 1931లో జన్మించిన అబ్దుల్ కలాం.. పేపర్ బాయ్ స్థాయి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన తీరు ఎందరికో ఆశ్చర్యం  కలిగిస్తుంది. ఎంత ఎధిగినా ఒదిగి ఉండటం ఆయన నైజం. యువతకు ఆయన ఎప్పుడూ ఆదర్శం. ఎందుకంటే కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం చెప్పిన మాట ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుకువస్తూనే ఉంటుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగే వారు ఎందరో ఉన్నారు.

ఒక సైంటిస్ట్ గా లైఫ్ ని ప్రారంభించిన అబ్దుల్ కలాం అంతరిక్ష పరిశోధనల్లో ఎంతో కృషి చేశారు. మన దేశానికి కీర్తి ప్రతిష్టతలు సంపాదించిపెట్టారు. అగ్ని, పృథ్వీ లాంటి క్షిపణులు అబ్దుల్ కలాం సారథ్యంలోనే ఆకాశంలోకి ఎగిశాయి. బాలిస్టిక్ క్షిపణుల అభివృద్దిలో అబ్దుల్ కలాం పాత్ర చాలానే ఉంది. అంతేకాదు 1992 నుండి 1999 వరకు ప్రధాని సైంటిఫిక్ అడ్వైజర్ గా పనిచేశారు.   భారతదేశానికి 11వ ప్రెసిడెంట్ గా పనిచేసి.. ఆ పదవికి వన్నెతెచ్చారు. ప్రజా రాష్ట్రపతిగా కీర్తిగణించారు. భారత రత్నతో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నారు.

రాష్ట్రపతిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టని అబ్దుల్ కలాం.. తర్వాత విద్యార్థులకు బాగా దగ్గరయ్యారు. తన విలువైన స్పీచ్ లతో స్టూడెంట్స్ లలో భవిష్యత్ పై ఆశలు రేకెత్తించారు. 2015వ సంవత్సరం.. జులై 27న లో షిల్లాంగ్ లో ఐఐఎం స్టూడెంట్స్ కు లెసెన్స్ చెబుతూ స్టేజ్ పై ఒరిగి ప్రాణాలు విడిచారు. అబ్దుల్ కలాం సేవల్ని దేశం ఎప్పటికీ మరిచిపోదు. నేడు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఇండియా హెరాల్డ్ ఆ మహోన్నత వ్యక్తికి సలాం చెబుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: