శానిటైజర్ ఔషధం కాదు.. కేంద్రం క్లారిటీ?
ఏం చేస్తాం ఊరికే శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ.. ఎక్కడ వైరస్ బారిన పడతామో అన్న భయంతో తప్పడంలేదు అందరికీ. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా శానిటైజర్ అనేది ఒక నిత్య అవసరంగా మారిపోయింది ప్రస్తుత రోజుల్లో. అయితే నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదైనా వ్యాధికి ఔషధాల నైనా రెగ్యులర్గా మర్చిపోకుండా వేసుకుంటారో లేదో తెలియదు కానీ శానిటైజర్ మాత్రం ఎక్కడైనా బయట ప్రదేశాల్లో చేతులు పెట్టారు అంటే వెంటనే జేబులో ఉన్న శానిటైజర్ తీసుకుని చేతులు మాత్రం తప్పకుండా శుభ్రం చేసుకుంటారు. అయితే శానిటైజర్ గురించి ఇటీవలే కేంద్ర ఒక కీలక ప్రకటన చేసింది.
ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో ఎక్కువగా వాడకంలోకి వచ్చిన శానిటైజర్ ఔషధ గుర్తింపు ఇచ్చారా అంటూ ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కరోనా వైరస్ సమయంలో ఎక్కువగా వినియోగిస్తున్న శానిటైజర్ కు ఔషధ గుర్తింపు ఇవ్వలేదు అంటూ స్పష్టం చేశారు. హ్యాండ్ శానిటైజర్ లు కేవలం క్రిమిసంహారక గా మాత్రమే కేంద్రం భావిస్తోంది అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక దేశీయ సంస్థల విజ్ఞప్తి మేరకు హ్యాండ్ శానిటైజర్ ల పై జిఎస్టి 15 నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గించింది అంటూ ఇటీవలే ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు.