ఆగస్ట్ నుంచి అసలు కధ .... ?

Satya
తెలుగు రాజకీయాలకు ఆగస్టు నెలకు అవినాభావ సంబంధం ఉంది. 1984 ఆగస్ట్ నెలలోనే ఎన్టీయార్ కి తొలి వెన్నుపోటు జరిగింది. అది జరిగిన పదకొండేళ్ళకు అంటే 1995 ఆగస్ట్ నెలలోనే సొంత అల్లుడు చంద్రబాబు నుంచి ఎన్టీయార్ కి తిరుగుబాటు ఎదురైంది. ఈ రెండు ఘటనలూ ఏపీ రాజకీయాలనే కాదు జాతీయ రాజకీయాలను చాలా తీవ్రంగా ప్రభావితం చేశాయి.
ఇదిలా ఉంటే ఎంత పెద్ద నాయకుడు అయినా తెలుగు రాజకీయాల్లో ఆగస్ట్ నెల అంటే జడుసుకోవాల్సిందే. ఇక జగన్ రెండేళ్ల పాటు సీఎం గా ఉన్నారు. గత ఆగస్ట్లో కరోనా వంటి సంక్షోభాలు ఎదురయ్యాయి. ఈసారి మాత్రం అలా కాదు కానీ వేరేలా  అంటున్నారు. ఆగస్ట్ అంటే ఈసారి అప్పుల కుప్ప ఆంధ్రా బండిని నడిపించడం పెద్ద సవాల్. అదే విధంగా ఆగస్ట్ నెల 3వ తేదీ నుంచి జగన్ ఆస్తుల కేసుల విషయంల విచారణ జోరు అందుకుంటుందిట. దానికంటే ముందు జూలై 30న బెయిల్ రద్దు పిటిషన్ మీద విచారణ ఉంది. ఒకవేళ తుది తీర్పు వస్తే ఆగస్ట్ ముంగిట మరో రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లే.
మరో వైపు సీబీఐ కోర్టులో ఆస్తుల కేసు విచారణ జోరు అందుకోవడం అంటే తుది దశకు కధ చేరినట్లే అంటున్నారు. ఇక ఏపీలో పాలన కొంత ఇబ్బందిగానే సాగుతోంది. ధనం ఉంటేనే కుటుంబం అయినా రాష్టం అయినా సాఫీగా నడిచేది. అప్పులు తెచ్చుకునే ఎటు చూసుకున్నా అసలు  వీలు లేదు, ఇక మరో వైపు ఆదాయాలు లేవు,  రాబడి అంతకంటే లేదు. ఈ నేపధ్యంలో ఆగస్ట్ నెలలోనే సీపీఎస్ ని రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. ఇలా చాలా సమస్యలు కుప్పలా పేరుకుపోయి ఉన్నాయట. ఇలా  అన్నీ ఆగస్ట్ నెలలోనే జగన్ని చుట్టుముడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా ఆగస్ట్ నెల రాజకీయ  భవిష్యత్తుని కూడా కొన్ని సార్లు సూచించి మహా నాయకులను ఇరకాటంలో పెట్టింది. దాంతో వైసీపీలో ఆగస్ట్ నెల మీద ఆందోళన అయితే ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ యాంటీ సెంటిమెంట్ ఎంతవరకూ వైసీపీని తాకుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: