పోలవరంపై ఫలించిన వైసీపీ ఎంపీల పోరాటం !

Veldandi Saikiran
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి  కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షేకవత్ ను వైసిపి ఎంపీల బృందం కలిసింది.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సవరించిన అంచనా వేయడం 55, 656 కోట్ల రూపాయలకు వెంటనే కేంద్ర ప్రభుత్వం వన్ ఆమోదం తెలపాలని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షేకవత్ కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎంపీలు. ఈ మేరకు కేంద్రమంత్రి గజేంద్ర షేకవత్ తో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.... పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర జల సంఘం మరియు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిన రెండవ సవరించిన అంచనా వ్యయాన్ని జాప్యం చేయకుండా ఆమోదం తెలపాలని ఆయన కోరారు. 
అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల ప్రక్రియను కూడా క్రమబద్ధీకరించాలని మరియు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని రాజమహేంద్రవరం పట్టణానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు విజయసాయిరెడ్డి. జలశక్తి మంత్రిత్వశాఖకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు అంచనా వ్యయాన్ని రెండోసారి సవరించి.. 55,548 కోట్లతో ప్రతిపాదనలను సమర్పించామని పేర్కొన్నారు. అలాగే టి ఏసి ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూనే వాటిని... కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని రివైజ్డ్ కాస్ట్ కమిటీ పరిశీలనకు పంపిందన్నారు. రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఈ ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం అంచనా వ్యయాన్ని...47725 కోట్లకు కుదించి తుది ఆమోదం కోసం... జలశక్తి మంత్రిత్వశాఖకు పంపించినట్లు స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. వీటన్నిటి పై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రికి విన్నవించారు.  
అయితే ఈ విషయాలపై  కేంద్ర జల శక్తి శాఖ సానుకూలంగా స్పందించింది. దీంతో కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో   వైఎస్ఆర్ సీపీ ఎంపీల సమావేశం విజయవంతం అయింది.  పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జలశక్తి శాఖ  ఒకే చెప్పింది. అంచనా వ్యయాన్ని  రూ. 47, 725 కోట్లకు అంగీకరించారు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్.  ఈ మేరకు నేడు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనున్నారు. అలాగే వచ్చే వారంలో కేంద్ర కేబినెట్ ముందుకు పోలవరం సవరించిన అంచనాలు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: