రాజ్‌కుంద్రాపై బాలీవుడ్ స్టార్ల షాకింగ్ కామెంట్స్ ?
2019 మార్చిలో బిజినెస్ మీటింగ్ కోసం రాజ్‌కుంద్రాను కలిశానని.. మీటింగ్ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా కుంద్రా తన ఇంటికి వచ్చాడని.. ఓ మెస్సేజ్ గురించి తనతో వాగ్వాదానికి దిగాడని షెర్లిన్ చెప్పినట్లు తెలుస్తోంది. శిల్పాశెట్టితో సరైన సంబంధాల్లేవంటూ.. తనని హత్తుకుని ముద్దుపెట్టుకున్నాడని.. అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయానని విచారణలో షెర్లీన్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అటు నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ కూడా కుంద్రా కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను బిగ్‌బాస్ షో చేస్తున్నప్పుడు ఓ ఏజెంట్ ఇంటిమేట్ సీన్స్ చేయాలని అభ్యర్థించాడని.. అంతేకాకుండా షూటింగ్‌కి ముందే అలాంటి సీన్స్ రిహార్సల్స్ చేసి వీడియోలు పంపమని కోరాడని ఆరోపించింది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకొనే అమ్మాయిలను కొంతమంది ఏజెట్లు మోసం చేసి.. అశ్లీల చిత్రాలలో నటింపజేస్తున్నారని సోఫియా మండిపడింది. మరోవైపు తన భర్తను ప్రతిష్టను దిగజార్చేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ.. 29 మీడియా హౌసెస్ మీద పరువు నష్టం దావా వేశారు శిల్పాశెట్టి . ఎలాంటి ఆధారాలు లేకుండా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె పిటిషన్‌పై ఇవాళ బాంబే హైకోర్టు విచారణ జరపనుంది. ఈ ఫోర్న్ వీడియోల కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి మరీ.