మోడీ దిగాలంటే కాంగ్రెస్ ఆ పని చేయాలి... ?

Satya
మోడీ అర్జంటుగా గద్దె దిగాలి. ఇది కాంగ్రెస్ సహా విపక్షాల స్లోగన్. నిజమే మోడీ దిగిపోతారు. కానీ దింపాల్సింది ప్రజలు కదా. బీజేపీ పూర్తి మెజారిటీతో గద్దెనెక్కింది. ఆ పార్టీకి ఇప్పటికీ దేశంలో బాగానే బలం ఉంది.
ఏవో ఒకటి రెండు చోట్ల ఎన్నికల్లో ఓడిందని బీజేపీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలు అవుతుంది అని ఎలా చెప్పగలరు. మరి దీని మీద అయితే విపక్షాలది అతి ధీమానా. లేక బీజేపీ పరిస్థితి అలాగే ఉందా అన్నది ఆలోచించాలి. నిజానికి బీజేపీ కూడా చాలా పొరపాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను ప్రెస్టేజి గా తీసుకోవడమే ఆ పొరపాటు. పైగా తనది కాని చోట. బలం లేని చోటా బీజేపీ వేలు పెట్టి ఓడి పరువు తీసుకుంటోంది
ఈ రోజుకీ దేశం మొత్తం మీద చూస్తే ఎంపీ ఎన్నికల్లో జనాల తీర్పు వేరుగా ఉంటుంది. మోడీ సరిసాటి ప్రధాని అభ్యర్ధి కూడా ఎవరూ లేరు. అందుకే మోడీ రెండు సార్లు గెలుస్తూ వచ్చారు. ఇక 2024 ఎన్నికల్లో బీజేపీ ఓడి కాంగ్రెస్ గెలవాలి అంటే ఈ రోజు నుంచే కాంగ్రెస్ మొత్తం సర్దుకోవాలి. పైగా కాంగ్రెస్ సొంతంగా తన బలాన్ని పెంచుకోవాలి. కాంగ్రెస్ కి ఈ రోజుకీ లోక్ సభలో సీట్లు చూస్తే అర్ధ సెంచరీ కూడా దాటలేదు. రేపటి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిస్తే బాగానే సీట్లు తెచ్చుకుంటాయి.
మరి కాంగ్రెస్ ని అవి భుజాన మోయాలి అంటే కష్టం. దాని కోసం కాంగ్రెస్ కూడా తన పరిశ్రమ గట్టిగానే మొదలెట్టాలి. కాంగ్రెస్ సొంతంగా కనీసం 136 సీట్లు తెచ్చుకుంటే విపక్షాలు హస్తం నీడకు చేరగలవని ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చారని టాక్. అంటే ఇప్పుడు లోక్ సభలో ఉన్న సీట్ల కంటే మూడొంతులు అన్న మాట. ఇది నిజంగా కాంగ్రెస్ కి టఫ్ టాస్కే. కాంగ్రెస్ మునుపటిలా లేదు. అందులో నాయకులు కూడా చెల్లాచెదురు అయిపోయారు. చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉనికి పోరాటం చేస్తోంది. మరి కాంగ్రెస్ కనుక ఆ నంబర్ తెచ్చుకుంటే మరో 136 సీట్లు ప్రాంతేయ పార్టీల నుంచి అందుకుని రాహుల్ ప్రధాని అయ్యే చాన్స్ ఉంది. కానీ అన్ని సీట్లు కాంగ్రెస్  తెచ్చుకోవాలంటే ఈ రోజు ఉన్నట్లుగా నెమ్మదిగా ఉంటే కుదరదు. పరుగులు పెట్టాలి, పదునైన వ్యూహాలు కూడా ఉండాలి. మరి ఉన్నాయా..వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: