దేశంలో పేదరికం ఇంతలా పెరిగిందా..?

MOHAN BABU
జాతీయ ఆహార  భద్రత  చట్టం  కింద  పేదలకు మరియు వలస కార్మికుల ఆకలిని తీర్చాలి . యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన  ఈ యొక్క చట్టం  2011 జనాభా లెక్కలను  అనుసరించి మన దేశంలో అమలు అవుతోంది. అయితే అప్పటి లెక్కలతో ఈ పథకాన్ని కొనసాగించినట్లయితే దేశం మొత్తంలో పెరుగుతున్న టువంటి పేదల పరిస్థితి ఏమిటని  పలువురు నిపుణులు అడుగుతున్నారు.  పరిస్థితులు ఇలాగే కొనసాగితే పేదలు ఇంకా నష్టపోయే అవకాశం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు.

ఈ ఒక్క విషయంలో మోడీ సర్కార్ అలసత్వం విడిచి 2021 జనాభా లెక్కలను  పరిగణలోకి తీసుకొని  ఈ యొక్క పథకాన్ని క్షేత్ర స్థాయిలో ఎలిజిబుల్ అయినటువంటి లబ్ధిదారులకు అందేలా చూడాలని  వారంటున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్ట్  వలస వచ్చిన కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి వారి ఆహార సంరక్షణకు  సంబంధించిన  కొన్ని ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా ఐదు ప్రధానంగా అంశాలు ఉన్నాయి.  ఇందులో ఐదవ అంశం చాలా ప్రధానమైనది. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం 2013 లోని సెక్షన్ 9 ప్రకారం  సబ్సిడీతో కూడినటువంటి ఆహార ధాన్యాలు  స్వీకరించడం కొరకై పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగినటువంటి మొత్తం  వ్యక్తుల సంఖ్యను మళ్లీ తిరిగి నిర్ణయించడానికి ప్రక్రియను కొనసాగించాలని సుప్రీంకోర్టు తెలిపింది.

 అది ప్రచురించిన జనాభా లెక్కల ఆధారంగా ఈ సంఖ్య నిర్ణయించబడుతుంది అని, సెక్షన్ నైన్ పేర్కొన్నది. సెక్షన్ 3 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 75%, పట్టణ ప్రాంతంలోని జనాభాలో 50 శాతం వరకు సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలు అందించవచ్చు. అజీమ్ ప్రేమించి నిర్వహించినటువంటి పరిశోధనలో  కరోనా మహమ్మారి కారణంగా  ఇరవై మూడు కోట్ల మంది ప్రజలు  దారిద్ర రేఖకు దిగువన పడిపోయారు. కరోణా కారణంగా దేశంలో  పేద వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని ఈ పరిశోధన ద్వారా తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: