ఇప్పటికే ఎక్కువైంది.. ఇక ఖాళీ చేయండి.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్?
కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అటు పాకిస్థాన్ ప్రభుత్వం మరో వైపు ఉగ్రవాద సంస్థలు మాత్రం ఎప్పుడూ భారత్ ను రెచ్చగొట్టే విధంగా వివిధ రకాల చర్యలు చేపడుతూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల ఏకంగా పాకిస్తాన్ ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్ విభాగంలో అధికారికంగా ఎన్నికలు నిర్వహించడం సంచలనంగా మారిపోయింది. అయితే మొదట్లోనే ఈ ఎన్నికలు నిర్వహించడం పై అంటూ భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ వినిపించుకోని పాకిస్థాన్ ప్రభుత్వం ఆక్రమిత కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. దీంతో ఇటీవలే భారత ప్రభుత్వం పాకిస్థాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం ఎన్నికలు జరపాలి అనుకుంటున్న కాశ్మీర్ భూభాగం భారత దేశం కి చెందింది అని వెంటనే ఇక పాకిస్తాన్ ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఖాళీ చేయాలంటూ ఇటీవలే చట్టబద్ధమైన హెచ్చరికలు జారీ చేసింది భారత ప్రభుత్వం. మీది కానీ భూభాగంలో మీరు అసలు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు అంటూ పాకిస్తాన్ ను ప్రశ్నించింది. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఒక స్వతంత్ర దేశం అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రపంచాన్ని మోసం చేసేందుకు ప్రయత్నించ వద్దు అంటూ భారత్ హెచ్చరించింది. భారత రాజ్యాంగం ప్రకారం భారత్లో అంతర్లీనమైన భూభాగాన్ని చొరబడి ఆక్రమించుకుని.. ఇప్పుడు ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు వెంటనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కాళీ చేయాలి అంటు హెచ్చరికలు జారీ చేసింది భారత్. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.