ఇవాళ్టి నుంచే ఎంసెట్‌ పరీక్షలు..ఇవి తప్పక పాటించాలి !

Veldandi Saikiran
ఇవాళ్టి నుంచే తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ కీలక ప్రకటన చేశారు.  గత ఏడాది కన్నా 28 వేల మంది ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్న కన్వీనర్‌ గోవర్ధన్‌..  ఆంధ్ర ప్రదేశ్‌ నుండి 50 వేల మంది పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు.  కరోనా మహమ్మారి బారిన పడ్డ విద్యార్థులకు అన్ని సెట్స్ పూరి కాగానే... పరీక్ష నిర్వస్తామని..  ఇప్పటి వరకు ఒకటి రెండు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని స్పష్టం చేశారు.

ఇక ఈ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యం అయిన పరీక్ష సెంటర్ లోకి నో ఎంట్రీ అని పేర్కొన్న ఆయన..కరోనా దృష్ట్యా విద్యార్ధులు మాస్కు లు ధరించి రావాలని వెల్లడించారు. అంతేకాదు... సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్.  4, 5, 6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్  పరీక్ష ఉంటుందని... మొత్తం 6 సెషన్స్ లలో పూర్తి చేస్తామని చెప్పారు. 9,10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ ... 3 సెషన్స్ లో ఉంటుందన్నారు. ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు పరీక్ష ఉంటుందని ప్రకటించారు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్.

ఇక ఇప్పటి వరకు  2 లక్షల 51 వేల 606 మంది ఎంసెట్ కి దరఖాస్తు చేసుకున్నారని... ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో లక్ష 64 వేల 962 మంది.. అగ్రి, మెడికల్ స్ట్రీమ్ లో 86 వేల 644 దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.  ఇక మొత్తం 105 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పిన ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్.. తెలంగాణ రాష్ట్రంలో 82, ఆంధ్ర ప్రదేశ్‌ లో 23 ఏర్పాటు చేశామని తెలిపారు.   విద్యార్థులు పెరిగిన నేపథ్యంలో సెంటర్లు, సెషన్స్ పెంచామన్నారు.  అలాగే ఈసారి ఇంటర్ వెయిటేజ్ లేదని...ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి సిలబస్, ద్వితీయ సంవత్సరం 70 శాతం సిలబస్ నుండే ప్రశ్నలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: