వాట్సాప్ షార్ట్ కట్స్ గురించి మీకు తెలుసా?

praveen
వాట్సాప్.. నేటి రోజుల్లో సందేశాలు ఇతరులకు పంపడానికి.. ఇతరులు పంపిన సందేశాలను అందుకోవడానికి కీలక ఫ్లాట్ఫామ్ గా మారిపోయింది. రోజురోజుకు వాట్సాప్ వినియోగం మన దేశంలో పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా వాట్సాప్ అనే యాప్ ఇన్స్టాల్ అయి ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం మిగతా మెసేజింగ్ యాప్స్ లేవా అంటే అవి కూడా ఉన్నాయి. కానీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ ఆకర్షిస్తూ.. ప్రస్తుతం టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది మాత్రం వాట్సాప్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 రోజురోజుకు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుంది తప్ప ఎక్కడా తగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఇక ఎప్పటికప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా సరి కొత్త ఫీచర్లను తీసుకు వస్తూ ఉంటుంది వాట్సాప్. అంతేకాదు నూతనమైన ఫీచర్లతో ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకుంటూ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే కొనసాగుతూ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో కోట్లల్లో వాట్సాప్ వినియోగిస్తున్న వారి సంఖ్య ఉంది అని చెప్పాలి. అయితే చాలామంది వాట్సాప్ వినియోగిస్తున్న వారు వాట్సాప్ లో ఉన్న అన్ని ఫీచర్స్ గురించి తెలుసు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాట్సాప్ లో దాగి ఉన్న కొన్ని రకాల ఆప్షన్స్ గురించి అంతేకాకుండా షార్ట్కట్ గురించి మాత్రం చాలామందికి తెలియదు.



 అయితే చాలామంది వాట్సప్ వెబ్ ద్వారా కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లోకి కూడా తమ వాట్సాప్ కనెక్ట్ చేసుకుని వాడుతూ ఉంటారు. ఇలా వెబ్ వాట్సాప్ షార్ట్కట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 వ్యక్తిగత చాట్ లో మెసేజ్ ను క్లియర్ చేయడానికి ఏదైనా గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి.. Ctrl+alt-backspace యూస్ చేయాలి.

 అంతే కాకుండా నేరుగా వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి అంటే.. Ctrl+alt+, క్లిక్ చేయాలి.

 ఇక ముఖ్యమైన గ్రూప్ ను టాప్ కి ఏం చేయాలి అంటే Ctrl+alt+shift+p క్లిక్ చేయాలి

 నోటిఫికేషన్ మ్యూట్ చేయాలి అంటే Ctrl+alt+shift+m క్లిక్ చేయాలి

 గ్రూప్ లోనే చాటింగ్ సెక్షన్లో సెర్చ్ కోసం Ctrl+alt+shift+f క్లిక్ చేయాలి.

 యూజర్ ప్రొఫైల్ అండ్ అబౌట్ సెక్షన్ కోసం Ctrl+alt+p క్లిక్ చేయాలి. ఇలా షార్ట్కట్ ద్వారా ఎంతో సులభంగా సేవలు పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: