బ్యాగ్ చోరీ.. టవల్ మీదే ప్రయాణికుడు.. చివరికి?
ఆ సమయంలో ఎవరైనా ఏం చేస్తారు.. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయడం లాంటివి చేస్తారు. కానీ ఆ యువకుడు మాత్రం ఏకంగా ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా ఆలోచించాడు. తన బ్యాగ్ ఎవరో దొంగలించడంతో ఒక యువకుడు మరో వ్యక్తి బ్యాగ్ ని దొంగలించాడు. దీంతో బాధితుడు ఏకంగా టవల్ తో నే వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేసాడు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం కి చెందిన సునీల్ కుమార్ అనే 24 ఏళ్ల యువకుడు నగరానికి రైల్లో వస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని బ్యాగ్ ఎవరో దొంగలించారు. దీంతో అతను కూడా ఇంకొకరి బ్యాగ్ దొంగలించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవలే శివశంకర్ అనే రిపోర్టర్ మీటింగ్ కోసం కార్యాలయానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఇక తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను వెయిటింగ్ హాల్ లో ఉంచి వాష్ రూమ్ కి వెళ్ళాడు. తిరిగోచ్చేలోపు దుస్తువులు,సెల్ ఫోన్, 7000 నగదు బ్యాగ్ కూడా చోరీకి గురైంది. ఆ సమయంలో ఒంటి మీద ఒక టవల్ తప్ప అతని దగ్గర ఏమీ లేదు.ఇక అలాగే టవల్ తో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు వ్యక్తి.ఇక తమ వద్ద ఉన్న దుస్తులు సదరు వ్యక్తి ఇవ్వడంతో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేసి మరిన్ని దుస్తులు తెప్పించుకున్నాడు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు నిందితున్ని పట్టుకొని బాధితుడికి అన్ని తిరిగి ఇప్పించారు.