తెలంగాణ సిఎస్ ఫై.. హైకోర్టు ఆగ్రహం?

praveen
కోర్టు దిక్కరణ కేసుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం పై ఇటీవలే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడం చర్చనీయాంశంగా మారిపోయింది. ఓ అధ్యాపకుడు దాఖలు చేసిన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఇటీవలే తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. అంతేకాకుండా గతంలోనే ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను వివరణ కోరింది హైకోర్టు. అయితే ఇటీవల సోమేష్ కుమార్ వివరణ ఇచ్చారు.


కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సీఎస్ సోమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు విడుదల చేయలేదు  సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమని ఈ సందర్భంగా తెలిపారు ఏజి. పిటిషనర్ ఉద్దేశపూర్వకంగానే   కోర్టును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు అంటూ  సీఎస్ సోమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. విచారణ సందర్భంగా వాస్తవాలు కోర్టు ముందుంచ లేక పోయాము అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా నిధులు విడుదల చేయవద్దన్న ఆదేశాలు ఉపసంహరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.




పిల్ పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు ఏజీ బీఎస్ ప్రసాద్.  ఇక వాదనలు అన్నీ విన్న తర్వాత .. జీవో రాసిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది హైకోర్టు.  మీరు చెబుతున్న ఉద్దేశ్యం ఏంటీ.. కాగితంపై రాసింది ఏమిటి అంటూ ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కేసులు ఖర్చుల కోసమేనన్న విధంగానే జీవో అనిపిస్తూ ఉందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. జీవో ఎలా రాశారో న్యాయ శాఖ చూడాలి కదా అంటూ ప్రశ్నించింది హైకోర్టు. ఇక ఈ కేసును సోమవారం విచారణ జరుపుతామని అంటూ హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: