కేసీఆర్ అసలు వ్యూహం ఇదేనా..?

MOHAN BABU
 అన్ని వైపుల నుంచి పెరిగిపోతున్న వ్యతిరేకత నుండి బయటపడడం కోసమే కెసిఆర్ ప్రత్యేకంగా ఓటు బ్యాంకును ఏర్పాటు చేయడం కొరకై హఠాత్తుగా  దళిత బంధు పథకం పై దృష్టిపెట్టారు. ఒక వైపు ఈ నెల 16వ తేదీన హుజురాబాద్ నియోజకవర్గం లో పర్యటనలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కెసిఆర్ చెప్పారు. అయితే ఉన్నట్టుండి భువనగిరి యాదాద్రి జిల్లా లోని వాసాలమర్రి గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో ముందుగా పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పిన కేసీఆర్ హుజురాబాద్ లో ప్రారంభం అన్నది కేవలం లాంఛనమేనని సమర్థించుకున్నారు.  76 కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తూన్నట్లు చెప్పారు.


గురువారం వారి ఖాతాలోకీ 10 లక్షల రూపాయలు పడతాయని ప్రకటించారు. ముందేమో హుజురాబాద్ నుండి రైతులు వందమంది పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు, గతంలో ప్రకటనకు విరుద్ధంగా వ్యవహరించారు.  తీరా ఆ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు . ఎంత మందికి వర్తింపజేయాలని ఇది పూర్తిగా సీఎం ఇష్టం అనడంలో సందేహమేమీ లేదు. అయితే వాసాలమర్రిలో కెసిఆర్ మాట్లాడుతూ  పథకం అమలుకు  లక్ష కోట్లు అవసరమని చెప్పారు. లక్ష కోట్లు కాదు ఇంక ఎంతైనా తీసుకొచ్చి దళితుల అభివృద్ధి కష్టపడతాను అని చెప్పడమే విచిత్రంగా ఉంది. దళితులందరూ అభివృద్ధిలోకి రావాలంటే అది తన లక్ష్యంగా చెబుతున్నారు. పేదలు వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చెందాలని అన్నారు. రాష్ట్రంలో ఇతర  సామాజిక వర్గాలను పక్కన   పెట్టేసి  పూర్తిగా దళిత గురించే మాట్లాడుతున్నాడు అంటే వారిని ఓటు బ్యాంకుగా చేసుకోవాలని ప్లాన్ లో కేసీఆర్ ఉన్నట్లు ఆరోపణలు మొదలయ్యాయి. రాష్ట్రం మొత్తం జనాభాలో ఎస్సీల ఎక్కువని కాబట్టి వారి ఓట్లపై కేసీఆర్ కన్నేసినట్టు ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపణలు మొదలుపెట్టాయి.


 దళిత బంధు పథకం లబ్ధిదారులు, నిధులను దుర్వినియోగం చేస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. నిజానికి దళితులకు ఆర్థిక సాయం అందించేందుకు దశాబ్దాలుగా ఎస్సీ కార్పొరేషన్ ఉంది. దాని ద్వారా నిధులు అందుకున్న దళితులు ఏ మేరకు సక్సెస్ అయ్యారు. ఎంత మంది ఫెయిల్  అయ్యారు. అనే విషయాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అసలు ఎస్సీ కార్పొరేషన్ ఇప్పుడు కేటాయించిన నిధులు అన్ని ఏమయ్యాయో కూడా ఎవరి లెక్కలు తెలియవు. ఇదిలా ఉండగానే  కొత్తగా దళిత బంధు పథకం అన్నారంటే పూర్తిగా ఓటు బ్యాంకు ఏర్పాటే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది. ఇది భవిష్యత్తులో ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: