టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్లి గెలుపు బాధ్యతలు తీసుకోవాలి. కానీ
మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఉమ్మడి
కరీంనగర్ జిల్లాలోనే కీలకంగా ఉన్నటువంటి
హుజురాబాద్ నియోజకవర్గం లో ఇప్పటివరకు కూడా అడుగు పెట్టకపోవడం వెనుక ఆంతర్యమేమిటో దాగి ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అదే జిల్లాకు చెందిన
మంత్రి అయిన
కేటీఆర్ సీఎం తర్వాత అన్ని తానై చూసుకుంటున్నా, కానీ
హుజురాబాద్ లో మాత్రం ఆయన ఎన్నికల బాధ్యత తీసుకోకుండా దూరంగా ఉంటున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.
మెదక్ జిల్లా మంత్రి అయిన హరీష్ రావుకు కెసిఆర్ ఈ బాధ్యతలు అప్పజెప్పడం విశేషం. ఇప్పటివరకు తెరవెనుక పనిచేసిన హరీష్ రావు ఇప్పుడు
హుజురాబాద్ లో అడుగు పెట్టి అక్కడ పరిస్థితులను టిఆర్ఎస్ కనుకూలంగా మారుస్తూ ఉన్నారు. మామూలుగా అయితే అలాంటి ఎన్నికలు బాధ్యతలన్నీ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ చూసుకోవాలి. ఇంతకుముందు
కేటీఆర్ కి అన్ని బాధ్యతలు అప్పగిస్తూ వచ్చిన
కేసీఆర్ ఈసారి మాత్రం కొడుకు
కన్నా అల్లుడు హరీష్ రావుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.
హరీష్ రావు ఇప్పుడు
హుజురాబాద్ లో చక్రం తిప్పుతున్నాడు. మొత్తం అన్ని పార్టీల నేతలను టిఆర్ఎస్ లోకి లాగేసుకుంటూ,
ఈటల రాజేందర్ పై విమర్శలు గుప్పిస్తూ ఆయనను నైతికంగా ఒంటరి చేసేందుకు తన పైన పెట్టిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తున్నాడు. ఈటెల వ్యాఖ్యలపై
మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందిస్తూ ప్రజల వ్యక్తి కంటే వ్యవస్థకి ప్రాధాన్యం ఇవ్వాలని, బిజెపిలో చేరినటువంటి
ఈటల రాజేందర్ మోడీ ఫోటోలు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు.
ప్రధాని మోడీ ఫోటో చూడగానే పెరిగిన పెట్రోల్,
డీజిల్ ధరలు గుర్తుకు వస్తాయని దీని ద్వారా ఓట్లు ఎవరు కూడా వేయారని అన్నారు. వీటిలో తన ప్రచార శైలిని మార్చారు అన్నారు. కాషాయ రంగు కేవలం తన ఫోటోను వేసుకుంటూ మిగతా నాయకులు ఫోటోలు పక్కన పెడుతున్నారని విమర్శ చేశారు. బీజేపీలో చేరిన టువంటి ఈటల గెలిస్తే నియోజకవర్గానికి చేసేదేమీ లేదన్నారు. తన శక్తితో కేంద్రం నుంచి వెయ్యి కోట్లు తెచ్చే
శక్తి ఉందా అని, ఈటెల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఇప్పటికే గ్యాస్,
డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచారు అని ఈటలను ఘాటుగా విమర్శించారు.
ఈ విధంగా
హుజురాబాద్ లో ఈటెలకు హరీష్ రావుకు మధ్య మాటలతో యుద్ధం జరుగుతోంది. అయితే
కేటీఆర్ మాత్రం ఇప్పటికి కూడా తన సొంత
జిల్లా అయినటువంటి హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక గురించి స్పందించకపోవడం చూస్తే
హుజురాబాద్ ఉప ఎన్నిక అనేది విజయం సాధించడం కష్టమే అన్నట్టు కనిపిస్తున్నది. అందుకే అపజయం వరిస్తే ఆ నైతిక బాధ్యతలు
కేటీఆర్ మీద పడతాయని ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం లో బాధ్యతల అప్పగించలేదని మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఓడిపోతే మాత్రం హరీష్ రావుకు మాత్రమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని అందుకే
కేసీఆర్ ఆయనకు అప్పగించారని వాదనలు వస్తున్నాయి.