అల్లకల్లోలం అవుతున్నా.. చైనా అసలు నిజాన్ని దాస్తోందా?
ఇక ఈ వైరస్ ద్వారా రూపాంతరం చెందిన డెల్టా వేరియంట్ డెల్టా ప్లస్ వైరస్ లు మళ్ళీ చైనాలో విజృంభిస్తున్నాయ్. దీంతో రోజురోజుకి చైనా లో పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం వైరస్ కారణంగా నాలుగు కోట్ల మంది ప్రజలను లాక్ డౌన్ లోకి నెట్టింది దీంతో ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోతుంది అదే సమయంలో ఇక ప్రస్తుతం చైనాలో వరదలు కూడా అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి.
చైనాలోని 25 నుంచి 30 శాతం భూభాగం వరదలతో అతలాకుతలం అయింది. అయితే ప్రపంచంలోనే అత్యధిక వంతెనలు నిర్మించిన దేశంగా ఉంది చైనా. కానీ ఇటీవలే వచ్చిన వరదల కారణంగా ఎంత మంది చనిపోయారో.. ఎంత దారుణమైన పరిస్థితులు వచ్చాయి అన్న విషయాన్ని మాత్రం ప్రపంచానికి తెలియకుండా దాచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అసహజమైన నీటి వంతెనల కారణంగా చైనా ఏకంగా ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టేసింది. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాణాలు వంతెనలు కూలి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల వచ్చిన వరదల కారణంగా ఏకంగా ఆరు కోట్ల వరకు ప్రజలు నిరాశ్రయులుగా మారిపోయారట. ప్రకృతి ఉగ్రరూపం దాల్చడంతో వచ్చిన వరదల కారణంగా ఎంతో సంక్షోభం ఏర్పడిందని.. కానీ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా చైనా దాస్తుంది అంటూ విశ్లేషకులు అంటున్నారు.