పాదయాత్రే...వైఎస్ ఇంటి విజయ రహస్యమా ?
తెలంగాణలో త్వరలో తన పాదయాత్రను ప్రకటించి ప్రజలకు మరింత చేరువ కావాలని, అంతే కాకుండా నిరంతరం పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు తమ పార్టీని మరింత చేరువ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం వైఎస్ షర్మిల పాదయాత్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అందరూ పాద యాత్ర చేయడం వేరే రాజన్న వారసురాలు పాద యాత్ర చేస్తే ఆ లెక్క వేరే అంటున్నారట రాజకీయ విశ్లేషకులు. ఒక్కసారి పాద యాత్రలో అడుగు వేశారు అంటే ఇక ఆమె విజయ యాత్ర మొదలైనట్లే..అంటున్నారు.
2004లో దివంగత రాజకీయనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రలో కాంగ్రెస్ తరపున పాద యాత్ర చేసి చివరకు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 2019కు ముందు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసి ప్రజల మనసును గెలుచుకుని ఆంధ్రకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇపుడు అదే ఇంటి వారసురాలు వై ఎస్ షర్మిల పాదయాత్ర మొదలు పెట్టారు అంటే ఇక ఆమెను ఎవరు అడ్డుకోలేరు... ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బహుశా వైఎస్ ఇంటి విజయ రహస్యం పాదయాత్రే కాబోలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి మా షర్మిలమ్మ అన్న నినాదాలు జోరుగా విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వై ఎస్ షర్మిల ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారు అన్న విషయంపై ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.