ఆ పేరు చెబితే చాలు జగన్ వణికిపోతున్నారు : లోకేష్

praveen
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల కు  సంబంధించిన ప్రకటన చేశారు. అయితే జగన్ ఈ  ప్రకటన చేయగానే ఏపీ రాజకీయాలు మొత్తం వాడివేడిగా మారిపోయాయి. అంతేకాదు ఇక అమరావతి లో రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు భగ్గుమన్నారు.  వెంటనే సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఇక సీఎం జగన్ మూడు రాజధానులు నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు తమ ఉద్యమాన్ని విరమించేది లేదు అంటూ అమరావతి రైతులు అందరూ భీష్మించుకు కూర్చున్నారు.



 నాటి నుంచి నేటి వరకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అటు అమరావతి రైతులు మాత్రం ఉద్యమాన్ని  ఆపకుండా కొనసాగిస్తూ వస్తున్నారు. కాగా నేటి అమరావతి రైతులు చేసిన ఉద్యమం 600 రోజులు పూర్తి చేసుకుంది. గత 600 రోజుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు నిరసన చేస్తూనే ఉన్నారు  అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల నిరసన తెలిపిన రైతులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ ఘటనపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. అమరావతి పేరు వెంటనే ఏపీ సీఎం జగన్ వణికిపోతున్నారు అంటూ విమర్శించారు.



 జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గకుండా అమరావతి రైతులు చేసిన ప్రజా రాజధాని పరిరక్షణ ఉద్యమం ప్రస్తుతం మహోద్యమంగా మారిపోయింది అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక అమరావతి రైతుల ఉద్యమం 600 రోజులు పూర్తయిన సందర్భంగా జేఏసీ పిలుపు మేరకు శాంతియుతంగా నిరసన తెలిపితే ఉద్యమకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. ఏకంగా ఎవరికీ కనిపించకుండా వ్యాన్లలో కుక్కి దారుణంగా కొట్టారు అంటూ ఆరోపించారు. మహిళల పట్ల కూడా పోలీసులు కనీసం విచక్షణ లేకుండా ప్రవర్తించారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు . పోలీసులు ఎన్ని ఇబ్బందులు సృష్టించినప్పటికీ మంగళగిరి దేవస్థానం చేరుకుని జై అమరావతి అని నినదించి.. ఇప్పుడు జైలు లో ఉన్నవారందరికీ తాను శిరస్సు వంచి నమస్కరిస్తూనట్లు నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: