నీరజ్ కు ఆఫర్ల వెల్లువ..! అతనికే కాదు..!

NAGARJUNA NAKKA
టోక్యో ఒలింపిక్స్ లో పసిడి నెగ్గిన నీరజ్ చోప్రాకు కోట్లకొద్దీ నగదు బహుమతులు, ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించాయి. అయితే నీరజ్ కే కాకుండా అతడికి శిక్షణ ఇచ్చిన కోచ్ లకూ ప్రభుత్వాలు బహుమతులు ఇస్తున్నాయి. తాజాగా నీరజ్ మాజీ కోచ్ కాశీ నాథ్ నాయక్ కు.. కర్ణాటక ప్రభుత్వం 10లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. సిర్సి ప్రాంతంలో నివాసం ఉంటున్న నాయక్.. 2010 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం అందుకున్నారు.

ఒలింపిక్స్ లో స్వర్ణం నెగ్గిన జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకు.. కేంద్రం బాగానే మద్దతిచ్చింది. విశ్వ క్రీడలకు ముందు 450రోజులు విదేశాల్లో ట్రైనింగ్ తీసుకోవడానికి.. పోటీల్లో పాల్గొనడానికి 4.9కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అతడి వ్యక్తిగత కోచ్ బార్టొనియోట్జ్ కు 1.2కోట్లు జీతం, జావెలిన్ లకు 4.3లక్షలు, యూరప్ లోని టోర్నీల కోసం 50రోజులు ఉండేందుకు 19.22లక్షలు ఖర్చు చేసినట్టు సాయ్ తెలిపింది.

దేశీయ విమాన సంస్థలు ఒలింపిక్ విజేతలకు బంపర్ ఆఫర్లు ప్రకటించాయి. పతకాలు గెలిచిన వారికి జీవిత కాలం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని స్టార్ ఎయిర్ టెల్ వెల్లడించగా.. ఐదేళ్లపాటు ఈ ఉచిత ఆఫర్ ఉంటుందని గోఫస్ట్ పేర్కొంది. స్వర్ణం అందించిన నీరజ్ చోప్రాకు ఏడాది పాటు ఉచితంగా విమాన టిక్కెట్లు ఇస్తామని ఇప్పటికే ఇండిగో విమాన సంస్థ వెల్లడించింది.  

మరోవైపు కరోనా కాలంలోనూ విశ్వక్రీడలను దిగ్విజయంగా పూర్తి చేసింది జపాన్. బయోబబుల్ పెట్టినా ఐపీఎల్, పీఎస్ఎల్ లాంటి టోర్నీలు కోవిడ్ కారణంగా రద్దయ్యాయి. కానీ దేశంలో వేలకు పైగా కేసులొచ్చినా విజయవంతంగా టోక్యో ఒలింపిక్స్ ను నిర్వహించింది జపాన్. 200దేశాలకు చెందిన 11వేల మంది అథ్లెట్లు, కోచ్ లకు మంచి ఆతిథ్యం ఇచ్చి.. 17రోజులు టోర్నీని నడిపించింది. అణుబాంబులే కాదు ఎలాంటి విపత్తులైనా ఎదుర్కోగలమని జపాన్ మళ్లీ స్పష్టం చేసింది.    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: