ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. రీఛార్జ్ చేసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్రీ?
ఒకవేళ రీఛార్జ్ యొక్క వాలిడిటీ అయిపోయిన తర్వాత కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా మళ్లీ రీఛార్జ్ చేసుకోలేకపోతున్నారు ఇలాంటి తరుణంలో ఇటీవల టెలికాం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వినియోగదారులందరికీ కొన్ని అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. తద్వారా మళ్లీ వినియోగదారులు అందరూ తమ తమ రీఛార్జి ప్లాన్ లను లను తిరిగి కొనసాగించే విధంగా ఆకర్షించడానికి నిర్ణయించింది భారతి ఎయిర్టెల్. అయితే ఇప్పటివరకు కేవలం రీఛార్జ్ చేసుకుంటే కొంతకాలం వాలిడిటీ తో అపరిమిత కాల్స్ డేటా మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు రీఛార్జి తో పాటు జీవిత బీమా కూడా రానుంది.
ఏకంగా పలు ఛార్జీలపై జీవిత భీమాను అందించేందుకు ఇటీవలే టెలికాం సంస్థ నిర్ణయించింది. ఇది ప్రస్తుతం కస్టమర్లకు ఒక బంపర్ ఆఫర్ అని చెప్పాలి. 279 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 4 లక్షల వరకూ జీవిత బీమా అందించేందుకు నిర్ణయించింది. ఇక 179 రూపాయల ప్లాన్ పై రెండు లక్షల జీవిత బీమా ఇవ్వనుంది. 279 ప్లాన్ రీఛార్జ్ ఎంచుకున్న కస్టమర్లకు ప్రతిరోజు 1.5 జీబీ డేటా తో పాటు వాలిడిటీ 28రోజుల వరకు పొందుతారు. 179 రూపాయలతో రీఛార్జి చేసుకున్న వారికి 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ తో పాటు 2 జీబీ డేటా ఉచితం గా వస్తుంది.