ఐఆర్సిటిసి గుడ్ న్యూస్.. తక్కువ ధరకే అదిరిపోయే ప్యాకేజ్?

praveen
ఐఆర్సిటిసి ఎప్పటికప్పుడు ప్రయాణికులను ఆకర్షించేందుకు ఎన్నో వినూత్నమైన ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటుంది. అంతేకాదు  ఎన్నో అద్భుతమైన ప్యాకేజీలను ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు ప్రయాణికులు ఆకర్షిస్తూ ఉంటుంది ఐఆర్సిటిసి.  ఇప్పటికే గత కొంత కాలం నుంచి ఎన్నో రకాల ప్యాకేజీలు ప్రకటించింది. ఇక ఇప్పుడు మరో సరికొత్త ప్యాకేజీతో ముందుకొచ్చింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్. భారత్ దర్శన్ పేరుతో ఇక ఇటీవలే ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ ప్రకటించిన ఈ టూర్ ప్యాకేజ్ ప్రయాణికులు అందరినీ ఆకర్షిస్తోంది. ఆగస్టు 29వ తేదీ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది.



 ఐఆర్సిటిసి ప్రకటించిన ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 10వ తేదీన ముగుస్తుంది. అంటే పన్నెండు రోజులపాటు ఇక ఈ ప్యాకేజీ కింద వెళ్లి రావచ్చు  అన్నమాట. అంతేకాదు ఇక ఇటీవల అద్భుతమైన టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ ఈ ప్యాకేజ్ కోసమే ప్రత్యేకంగా ఒక రైలు నడిపేందుకు కూడా సిద్ధమైంది. ఇక ఈ ప్యాకేజీలో భాగంగా ప్రతి ఒక్క ప్రయాణికుడు పదకొండు వేల  మూడు వందల నలభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇంత తక్కువ మొత్తంలోనే టూరిస్ట్ ప్లేస్ లు అన్నింటిని కూడా తిరిగి చూసే అవకాశం మీకు కల్పించింది ఐఆర్సిటిసి.



 కాగా ఇప్పటివరకు ఐఆర్సిటిసి ప్రకటించిన అతి తక్కువ టూర్ ప్యాకేజీలలో ఇది కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హైదరాబాద్, అహ్మదాబాద్ నిష్కలంక మహదేవ్ టెంపుల్, అమృత్సర్, జైపూర్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లాంటి అన్ని పర్యాటక ప్రాంతాలను ఇక ఈ టూర్ ప్యాకేజీ లో భాగంగా తిరిగి చూడ వచ్చు. అంతేకాదు ఇక ఈ టూర్లో భాగంగా ప్రయాణించే ప్రయాణికులు అందరికీ కూడా శానిటేషన్ కిట్స్   ట్రావెల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది ఐఆర్సిటిసి.  ఇక ప్రయాణికులకు సంబంధించిన ఫుడ్ చార్జీలు అన్ని కూడా ఐఆర్సిటిసి చూసుకుంటుంది. కానీ లోకల్ లో ఉండే ఛార్జీలు మాత్రం ఇక  టూరిస్టుల భరించాల్సి ఉంటుంది. ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా ఇక ఈ టూర్ ప్యాకేజీ ఫై ఆసక్తి ఉన్నవారు టికెట్ బుక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: