అమరావతి : సింహాచల దేవస్థానం భూములు, మాన్సాస్ ట్రస్టు భూముల అవకతవకల పై విజిలెన్స్ ఎంక్వైరీ కి జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మాన్సాస్, సింహాచలం భూముల వ్యవహరం పై విచారణ చేయించేందుకు విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ దర్యాప్తునకు ఆదేశించింది జగన్ ప్రభుత్వం. సింహాచలం భూముల ను ఆస్తుల రిజిస్ట్రీ నుంచి అక్రమంగా తొలగించటం, మాన్సాస్ ట్రస్టు భూముల విక్రయాల కు సంబంధించి విజిలెన్స్ ఎన్ ఫోర్సుమెంట్ విభాగం దర్యాప్తు చేస్తుందని ఉత్తర్వు ల్లో పేర్కొంది జగన్ ప్రభుత్వం.
అప్పటి దేవస్థానం ఈఓ, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ అవకతవకల కు కారణమని ప్రాథమికంగా తేలటం తో సస్పెన్షన్ వేటు వేసినట్టు పేర్కొన్న జగన్ సర్కార్ ...దేవాదాయ శాఖ లోని ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రామ చంద్రమోహన్ పై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. అంశం తీవ్రత దృష్ట్యా మరింత మంది పాత్ర ఈ అవకతవక ల్లో బయటపడే అవకాశమున్నందున లోతు గా దర్యాప్తు చేసేందుకు విజిలెన్స్ విచారణ చేపట్టనుంది జగన్ సర్కార్.
మూడు నెలల్లోగా విచారణ నివేదికను సమర్పించాల్సింది గా ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కార్ .. ఈ అవకతవకలకు సంబంధించి విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ విభాగానికి సమాచారం ఇచ్చేందుకు దేవా దాయశాఖ కమిషనర్ నోడల్ అధికారిగా ఉంటారని స్పష్టం చేసింది. ప్రత్యేకించి మాన్సాస్ ట్రస్టులో పెద్ద మొత్తంలో భూముల అవకతవకలు జరిగటంతో నేరుగా విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ విభాగం ముందస్తు సమాచారం తో తనిఖీలు చేయొచ్చని స్పష్టం చేసింది జగన్ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్. ఇది ఇలా ఉండగా అశోక్ గజపతి ను మాన్సస్ ట్రస్ట్ ఛైర్మన్ నుంచి తొలగించి తనను చేయాలని నిన్న హై కోర్టు ను ఆశ్రయించింది ఊర్మిళ గజపతి రాజు.