మొన్న అయోధ్య.. ఇప్పుడు కాశి?

praveen
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోని దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను క్రమక్రమంగా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే  కొన్ని దశాబ్దాల నుంచి హిందువుల కలగా ఉన్న అయోధ్య భూభాగంలో రామమందిర నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది.  కనీవినీ ఎరుగని రీతిలో వేల కోట్ల రూపాయలతో ప్రస్తుతం రామమందిర నిర్మాణం జరుగుతోంది. 2023 సంవత్సరానికల్లా ఇక రామమందిర నిర్మాణం పూర్తవుతుందని ఇప్పటికే రామమందిర ట్రస్ట్ ప్రకటించింది. ఇక ఆ రోజు కోసం హిందువులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

 ఈ కార్యక్రమం లో కేంద్ర ప్రభుత్వం ఇక దేశంలో ఉన్న మరిన్ని ప్రముఖ క్షేత్రాలను కూడా అభివృద్ధి చేసేందుకు భారీగా నిధులు కేటాయిస్తుంది. దేశంలో ఉన్న ప్రముఖ క్షేత్రాలలో మధుర, కాశి క్షేత్రాలు కూడా ఉన్నాయి. చరిత్ర లో ఈ రెండు పుణ్య క్షేత్రాలను కూడా ధ్వంసం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని కాశీ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే దిశగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

 ప్రస్తుతం  వారణాసి లో కొత్తగా కారిడార్ను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ పనులన్నీ త్వరలో పూర్తి కాబోతునట్లు సమాచారం.  2021 నవంబర్ నాటికి మొత్తం పనులు పూర్తవుతాయని ఆలయ అధికారులు చెబుతున్నారు.  నాలుగు అద్భుతమైనటువంటి గేట్ల నిర్మాణం చేపడుతున్నారట. అంతేకాకుండా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేస్తున్నారట. అంతే కాకుండా గంగా ఘాట్ ను  కలపడానికి ఇక కారిడార్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారట. యాత్రికులు అందరికీ కూడా ఒక అద్భుతమైన వసతి కల్పించేందుకు ప్రస్తుతం అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తి కాగా..  నవంబర్ నాటికి మొత్తం పూర్తి అవుతాయి అని చెబుతున్నారు ఆలయ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: