పాకిస్థాన్ లో వింత.. రైలు వచ్చింది.. పట్టాలు కనిపించలేదు.?
అక్కడ ఉండాల్సిన రైలు పట్టాలు ఏమయ్యాయి.. రైలు పట్టాలు ఉండాల్సిన చోట అసలు తారు రోడ్డు ఎలా వచ్చింది అని అనుకుంటున్నారు కదా.. ఇది తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే... పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి ఇటీవలే క్వీట్ట అనే ప్రాంతాన్ని సందర్శించారు. సాధారణంగా దేశ అధ్యక్షుడు ఇలా పర్యటించిన సమయంలో ఏదో ఒక ప్రారంభోత్సవం చేయించడం లాంటివి చేస్తూ ఉంటారు. స్కూలు హాస్టళ్లు కళాశాలలు ప్రభుత్వ భవనాలు ప్రారంభించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దీన స్థితిలో ఉండటంతో చివరికి ఒక తారు రోడ్డు వేయాలి అని అనుకున్నారు..
దీంతో ఇక పాకిస్తాన్ అధ్యక్షుడు చేత ఒక రోడ్డు ప్రారంభోత్సవానికి చేయించారూ. ఇంతకీ ఆ రోడ్డు ఎక్కడ వేశారు అనుకుంటున్నారు.. రైలు పట్టాలపై. రైలు వెళ్లే టువంటి పట్టాలను క్లోజ్ చేసి అక్కడ ఏకంగా తారు రోడ్డు వేశారు. ఇక ఆ తర్వాత రోజు ఉదయం సమయంలో క్వీట్ట కి ఒక ట్రైన్ రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే కొంతదూరం రాగానే ముందు పట్టాలు కనిపించకపోవడంతో రోడ్డు ఉండడం చూసి ఒక్కసారిగా లోకో పైలెట్ షాక్ అయ్యాడు. లోకో పైలెట్ ట్రైన్ నుంచి దిగి చూడగా రెండు వైపులా పట్టాలు ఉన్నాయి. కానీ మధ్యలో తారు రోడ్డు ఎలా వచ్చింది అని తల పట్టుకున్నాడు. అక్కడ మాత్రం దేశ అధ్యక్షుడు రోడ్డు కి ప్రారంభోత్సవం చేశారు అని ఒక బోర్డు కూడా ఉండటంతో అతను షాకవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ట్రైన్ లో ఉన్న ప్రయాణికులందరూ కిందకు దిగి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.