దారుణం.. 58 దేవాలయాలను ధ్వంసం చేశారు?

praveen
ప్రపంచ వ్యాప్తంగా అన్ని మతాల కు సంబంధించిన వ్యక్తులు కలిసి ఎంతో స్వేచ్చగా సామరస్యంగా బతికేందుకు అవకాశం ఉండేది  దేశం  భారత్. భారత్ లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటూ ఎన్నో రకాల మతాలు ఉన్నాయి. ఎన్ని మతాలు ఉన్నప్పటికీ అందరూ సామరస్యంగా ఉంటారు. ఇక తమ మత దేవుళ్ళను పూజిస్తూ ఇతర మత దేవుళ్లను గౌరవిస్తూ ఉంటారు. అంతేకాదు  తమ మతానికి సంబంధించిన ప్రార్ధనా మందిరాలు సాంప్రదాయాల విషయంలోనే కాదు ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు సాంప్రదాయాలను గౌరవిస్తూ ఉంటారు. కానీ..  భారత్ పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ ఆఫ్గనిస్థాన్ పాకిస్థాన్ దేశాల్లో మాత్రం హిందువుల మనుగడకి రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతోంది.



 ఈ మూడు దేశాలు కూడా ఒకప్పుడు భారత దేశం లో అంతర్భాగమైన దేశాలు కావడం గమనార్హం.  ఈ నేపథ్యంలోనే ఇక ఆఫ్ఘనిస్థాన్ పాకిస్థాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాలలో సిక్కులు జైనులు ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు.  అయితే భారత్ ప్రస్తుతం ముస్లింలు సహా ఇతర మతస్తుల విషయంలో కూడా ఎంతో సామరస్యంగా వ్యవహరిస్తుంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ లలో మాత్రం ఎంతో మంది హిందువులు తీవ్రస్థాయిలో అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  అంతేకాదు ఆయా దేశాలలో క్రమక్రమంగా హిందూ ఆలయాలను కూడా ధ్వంసం చేస్తూ ఉండడం గమనార్హం.



 సిక్కులు జైనులు లాంటి వారికి ఆయా దేశాల్లో కేవలం డి గ్రేడ్ ఉద్యోగాలు మాత్రమే ఇస్తారు.  ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో వారికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కనీసం ఇక దేవుళ్లకు పూజలు కూడా చేయనివ్వరు.  ఇక ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూజలు చేయడం లాంటివి చేస్తే ఏకంగా వారికి సంబంధించిన దేవాలయాలను ధ్వంసం చేయడం లాంటివి చేస్తారు. ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి ఇక వందల సంఖ్యలో హిందూ దేవాలయాలు ధ్వంసం చేశారు.  ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ లో ఏకంగా 58 హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు అన్న విషయం బయటపడింది. ఇది కాస్త సంచలనంగా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: