దారుణం : మద్యం మత్తులో.. తల్లి అని కూడా చూడలేదు?
మద్యం మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఏకంగా ఎంతోమంది దారుణాలకు పాల్పడుతున్నారు. కొంతమంది ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు . మరికొంతమంది సొంత వాళ్లని దారుణంగా హత్య చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ మద్యం మత్తు మరొకరిని నేరస్థుడిగా మార్చేసింది. ఏకంగా నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి ని దారుణంగా హత్య చేసే పరిస్థితిని తీసుకొచ్చింది మద్యం. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయినా కొడుకు ఏకంగా కన్నతల్లినే పొట్టన పెట్టుకున్నాడు.
ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కుమ్మర గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గత కొంత కాలం నుంచి మద్యానికి బానిస గా మారి పోయాడు కిష్టయ్య. ఇంటికి మద్యం తాగి వచ్చేవాడు. అయితే మందు తాగడం మానేయాలి అంటూ పలుమార్లు తల్లి కిష్టయ్యను మందలించింది. అయినప్పటికీ తీరు మార్చుకోని కిష్టయ్య తరచూ ఫుల్లుగా మద్యం తాగి వస్తూ ఉండటంతో తల్లికి కొడుక్కి మధ్య పలుమార్లు ఇప్పటికే గొడవలు కూడా జరిగాయి. ఇక ఇటీవల మరోసారి తల్లి మద్యం మానేయాలి అంటూ కొడుకుకి సూచించింది. కానీ తల్లి చెప్పిన మాట తో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు కిష్టయ్య. ఇక తల్లి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి బండరాయితో కొట్టి చంపేసాడు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిష్టయ్య ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.