దారుణం: 11 నిమిషాలే రేప్ జరిగిందని.. శిక్ష తగ్గించిన జడ్జి..!
ఈ కేసులో తీర్పు చెప్పిన మహిళా జడ్డి.. కేవలం 11 నిమిషాలే రేప్ జరిగిందన్న కారణంతో శిక్ష తగ్గిస్తూ తీర్పు చెప్పింది. బెర్లిన్ లోని స్విస్ అప్పీల్ కోర్టు మహిళా జడ్జి ఇచ్చిన ఈ తీర్పుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 11 నిమిషాలు రేప్ చేశాడని.. అంతే కాదు... ఈ రేప్ లో బాధితురాలికి పెద్దగా గాయాలేమీ కాలేదని మహిళా జడ్జి వ్యాఖ్యానించడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. ఈ తీర్పు షాక్ కి గురైన స్థానిక ప్రజలు ఆ మహిళా జడ్జి తీర్పుకి నిరసనగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
ఈ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే.. 2020 ఫిబ్రవరిలో ఓ నైట్ క్లబ్లో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసారు. అందులో ఒకరు 33ఏళ్ల వ్యక్తి.. ఇంకొకరు 17ఏళ్ల మైనర్.. ఈ కేసులో 17ఏళ్ల మైనర్పై జువెనైల్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. 33 ఏళ్ల వ్యక్తికి కోర్టు ఇప్పటికే నాలుగేళ్ల మూడు నెలల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును నిందితులు మళ్లీ పై కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టిన పైకోర్టు.. నిందితులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. శిక్షను మూడేళ్లకు తగ్గించింది.
ఇందుకు సదరు మహిళాజడ్జి చెప్పిన కారణాలే ఇప్పుడు ఆందోళనలకు దారి తీస్తున్నాయి. బాధితురాలిపై లైంగికదాడి కేవలం 11 నిమిషాలే జరిగింది కదా అంటోంది మహిళా జడ్జి. పైగా బాధితురాలికి పెద్దగా గాయాలేవీ కాలేదు కదా అని సదరు న్యాయమూర్తి వ్యాఖ్యానించింది. అందుకే జైలు శిక్షను మూడేళ్లకు తగ్గిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.