కేరళలో విజ్ఞానులే.. అజ్ఞానులవుతున్నారా.. మరీ ఇదేంటి?
అదే సమయంలో ఇక మూడవ వేవ్ కూడా దూసుకు వస్తుంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ మేము జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇక మూడవ వేవ్ ఎలా ప్రభావం చూపుతుంది అని అందరూ ధైర్యంగానే ఉన్నారు. కానీ ఇక్కడ ఒక రాష్ట్రంలో మాత్రం కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుంటే కేరళలో మాత్రం కేసుల సంఖ్య 20,000 దాటిపోతుంది. దేశంలో వెలుగులోకి వస్తున్న కొత్త కేసులలో 70% కేసులు కేవలం కేరళలోనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే కేరళలో అన్ని రాష్ట్రాలలో కంటే అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంటుంది. అక్కడ వున్న ప్రతి ఒక్కరూ దాదాపుగా చదువుకుని ఉంటారు. ఇలా కేరళలో ఉన్న విజ్ఞానులే ప్రస్తుతం కరోనా వైరస్ విషయంలో మాత్రం అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు అని ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించింది. ఇప్పుడిప్పుడే తగ్గుతుంది అనుకుంటే.. కేరళలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దేశాన్ని ప్రమాదంలో పడేసే దిశగా తీసుకు వెళ్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివితే ఏం లాభం కనీస లోక జ్ఞానం లేక పోతే మొదటికే ప్రమాదం వస్తుంది అని అంటున్నారు. మరి కేరళలో ఇప్పటికైనా జనాలు మారిన తగిన జాగ్రత్తలు పాటించి వైరస్ కేసులు తగ్గేందుకు తోడ్పాటు అందిస్తారా లేదా చూడాలి మరి.