భవిష్యత్తులో ఇండివిడ్యువల్ ఆరోగ్య శ్రీ కార్డ్స్..?
రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై ఉన్నత స్థాయి అధికారులతో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ పట్ల శ్రద్ధ వహించాలని టీచర్లతో పాటు స్కూల్స్‌లో పని చేసి సిబ్బందికి టీకా ఇచ్చే క్రమంలో ప్రయారిటీ ఇవ్వాలని తెలిపారు. గ్రామాల యూనిట్‌గా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగాలని సీఎం చెప్పారు. సమీక్ష సందర్భంగా ఏపీ డిజిటల్ హెల్త్‌పై సీఎం జగన్ ఆరా తీవారు. ఆరోగ్య శ్రీ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాల డేటా క్యూఆర్‌కోడ్ రూపంలో అందుబాటులో ఉండాలన్నారు. విలేజ్‌క్లినిక్స్‌లోనూ ప్రతీ ఒక్కరి డేటా అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రతీ గ్రామం, వార్డు క్లినిక్‌లో కంప్యూటర్ ఉండాలని, అందులో పౌరుల ఆరోగ్య వివరాలు తేదీ, సమయంతో సహా నమోదు చేయాలని చెప్పారు.
ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఈ వివరాలన్నీ నమోదు చేయడం ద్వారా ప్రతీ వ్యక్తికి ట్రీట్‌మెంట్ ఈజీగా అందే చాన్సెస్ ఉంటాయని వివరించారు జగన్. ఫ్యూచర్‌లో కుటుంబానికి కాకుండా విడివిడిగా వ్యక్తుల పేరుమీద ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చే ఆలోచన చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఏదేని కుటుంబంలోని ఒక కుటుంబ సభ్యుడు క్యూఆర్ కోడ్‌ను స్వైప్ చేయగానే ఆవ్యక్తితో పాటు, కుటుంబీకుల హెల్త్ డీటెయిల్స్ వెంటనే లభ్యమయ్యేలా చూడాలని చెప్పారు.
ఇందుకు ప్రతీ ఒక్కరి ఆరోగ్యశ్రీ కార్డును ఆధార్‌కార్డు నెంబర్‌తో లింక్‌చేసేలా చూడాలని తెలిపారు. గ్రామాల్లోని నీరు, గాలి, మట్టి నమూనాలను పరిశీలించి, కాలుష్య స్థాయిలపై తగిన వివరాలు తీసుకోవాలని ఆఫీసర్లను సీఎం ఆదేశించారు. శానిటేషన్ పరిస్థితులూ నమోదు చేయాలని చెప్పారు. ఈ క్రమంలోనే తాగునీటి ట్యాంకుల పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి మొదలుకుని పై స్థాయి ఆస్పత్రుల వరకు అన్నిటికీ కాంపౌండ్ వాల్స్ ఉండాలని సీఎం తెలిపారు. ఇందుకుగాను అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.