పాడైన కేబుల్స్ పడేయకండి.. ఇలా యూజ్ చేస్తే సరి...!

Suma Kallamadi
ప్రజెంట్ టైమ్స్‌లో ఫోన్ అనేది ప్రతీ ఒక్కరి కంపల్సరీ అయిపోయింది. ఫోన్ లేని వ్యక్తులు మనకు అరుదుగా కనిపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఫోన్‌తో పాటుగా చార్జర్ కంపల్సరీగా అవసరముంటుంది. ఒకవేళ చార్జర్ లేకపోతే ఫోన్ మాట్లాడే చాన్స్ ఉండదు. కనుక ప్రతీ ఒక్కరు చార్జర్‌ను యూజ్ చేస్తుంటారు. అయితే, మనలో చాలా మంది ఫోన్ చార్జర్స్ లేదా వాటి కుండే కేబుల్స్ పాడైపోతే పక్కన పారేస్తుంటాం. కొద్ది రోజులు చేసి ఇది ఎందుకు పనికి రాదని బయట పడేస్తుంటాం. కేబుల్స్ కూడా అంతే చేస్తాం. ఎలుక దాన్ని చిన్నగా కొరికినా అది పాడైపోతుంది. ఇక ఇది ఎందుకు పనికిరాదు అని భావించి చెత్తలో పడేస్తుంటాం. అయితే, అలా చేయొద్దట. పాడైన చార్జర్ కేబుల్స్‌తోనూ యూసేజ్ ఉందట. ఏయే యూసేజెస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.
మీ దగ్గరున్న ఓల్డ్ కేబుల్స్‌ను యూజ్ చేసుకుని స్మాల్ సైజు బుట్టను తయారు చేసుకోవచ్చు తెలుసా? ఎలాగంటే కేబుల్ నుంచి వైర్లను మొత్తం తీసి లోపల క్లాత్ రౌండ్‌గా చేసి బుట్టగా అల్లుకోవచ్చు. ఈ బుట్టకు పెయింటింగ్స్ కనుక వేస్తే ఇవి ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వైర్లు సాధారణంగా చాలా బలంగా ఉంటాయి. ఇక వాటితో చేసిన బుట్టలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
ఈ బుట్టను చిన్న చిన్న వస్తువుల్ని వేసే బాక్స్‌గా యూజ్  చేసుకోవచ్చు. చిల్డ్రన్స్‌కు సంబంధించిన ఐటమ్స్ రబ్బర్స్, పెన్నులు, పెన్సిల్స్ ఇతరాలు ఈ బుట్టలో వేసుకోవచ్చు.  ఇకపోతే ఈ బుట్టలు చిన్నపిల్లలకు నచ్చుతాయి కూడా. చార్జర్ కేబుల్‌ను ముక్కలుగా చేసి వాటితో ఏదైనా బర్డ్ షేప్‌లోకి తీసుకురావచ్చు. కేబుల్స్ గుండ్రంగా చుట్టినా కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రౌండ్ షేప్‌లో కేబుల్స్‌ను చుట్టి అందులో అట్టముక్కలు, దూది, వెట్ క్లాత్స్ ఇతరాలు వేసి పక్షి గూడులాగా కూడా మనం మార్చుకోవచ్చు. అందులో గింజలు వేయడం ద్వారా పక్షులు అక్కడకు వస్తాయి. అలా వాటికి ఫుడ్‌ను మనం సప్లై చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: