ఓ ఆటోవాలా.. నీకు సలాం?
ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఇంకా మానవత్వం అందరిలో బ్రతికే ఉంది అనిపిస్తుంది. ఇక్కడ ఓ ఆటోవాలా తనలోని మానవత్వాన్ని చాటుకుని సమాజంలో సరికొత్త స్ఫూర్తి నింపాడు. నేను ఒక సాదా సీదా ఆటోవాలా కావచ్చు.. ధనవంతుల తో పోల్చి చూస్తే నేను తక్కువ స్థాయి కావచ్చు.. కానీ ఇలా పేదరికంలో పుట్టినందుకు నేను ఎప్పుడూ దేవున్ని తిట్టుకోలేదు ఎందుకు అంటారా నాకు దేవుడు ధనం ఇవ్వకపోవచ్చు.. కానీ సంపద కంటే ఎక్కువ ప్రతి మనిషిలో ఉండాల్సిన మానవత్వాన్ని ఒక గొప్ప మనసును మాత్రం ఇచ్చాడు. ఇది ఆ ఆటోవాలా మనసులోని మాట.
మామూలుగా నేటి సమాజంలో ఆటోవాలా అంటే అందరూ కాస్త చులకనగా చూస్తూ ఉంటారు. కానీ ఇటీవలే అదే ఆటోవాలా చేసిన పని తెలిస్తే మాత్రం సలాం కొడతారు ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆటో డ్రైవర్ ఏకంగా అవయవదానంతో ఏడుగురికి పునర్జన్మ ఇచ్చాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అనే 34 ఏళ్ల వ్యక్తి పేద వాడే ఇక బతుకుదెరువుకోసం ఆటో నడుపుతాడు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఇటీవల ఐసీయూలో చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచాడు. ఈ క్రమంలోనే ఇక అతని కుటుంబ సభ్యులు అతని యొక్క గుండె, మూత్రపిండాలు, కాలేయం, రెండు కార్నియాలు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారికి అందించాలని భావించారు. దీంతో ఏడుగురికి అతని అవయవాలు అందించి ఏకంగా వారికి పునర్జన్మ ఇచ్చాడు ఆటోవాలా.